ప్రముఖ ఆలయాలకు జియో ట్యాగింగ్ .. డీజీపీ కీలక ఆదేశాలు !

Update: 2020-09-13 09:30 GMT
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖ ఆలయంగా విశిష్టత కలది. అయితే ఇంతటి ప్రసిద్ధి ఉన్న అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన పెను సంచలనమైంది. ఇప్పటికే ఈ ఘటనపై జగన్ సర్కార్‌ సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీస్, సబ్ డివిజన్, యూనిట్ రేంజ్ అధికారులతో ఇవాళ డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సలహాలు, సూచనలు చేశారు.

గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలని, దేవాలయ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియాలో వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్‌ బుక్‌లు ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలి. ప్రజలు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి దేవాలయం దగ్గర పాయిట్‌ బుక్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్ సూచించారు. ఎటువంటి ఉత్సవాలు వచ్చినా స్థానికులతో కమిటీ లు‌ వేసి వారే నిర్వహించేలా చూసుకోవాలి. స్థానికంగా ఉండే పరిస్థితులు, అంశాలను బట్టి కూడా ఎస్పీలు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరిగినా కారకులు ఎంతటి‌వారైనా వదిలే ప్రసక్తే లేదు. అదే విధంగా ‌విధుల్లో అలక్ష్యం వహిస్తే పోలీసు సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం అని డీజీపీ స్పష్టం చేశారు.
Tags:    

Similar News