• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి కొడుకు చెప్పుతో...

మంత్రి కొడుకు చెప్పుతో కొడతానంటున్నాడు

By - Tupaki Desk
Update: 2016-11-11 14:33 GMT
మర్యాదలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. తమలోని ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని.. చిరాకును ప్రదర్శించేందుకు పెద్ద పెద్ద మాటల్ని అనేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. ఎవరికి నచ్చినట్లుగా వారుగా మాట్లాడేస్తున్నారు. ఎంత మాట పడితే అంత మాట అనేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తాజాగా ఒక మంత్రిగారి అబ్బాయి ఎంతగా నోరు పారేసుకున్నారో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

రాజకీయాలన్నాక విమర్శలు.. ప్రతివిమర్శలు మామూలే. అయితే గడచిన కొద్ది కాలంగా పెరుగుతున్న అసహనం రోజురోజుకీ పెరిగి పెద్దది అవుతోంది. తమను ఎవరూ ఏమీ అనకూడదన్నట్లుగా ఫీలవుతున్నారు. ఎవరైనా విమర్శిస్తే వారిపై ప్రతి విమర్శలు చేయటం మానేసి తిట్ల పురాణం అందుకోవటం లేదంటే దాడులకు దిగుతామని బెదిరించేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా అలాంటి ఘనకార్యాన్నే ప్రదర్శించారు మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖామంత్రి గౌరిశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్.

ప్రధాని మోడీ మీద తమకున్నఅభిమానాన్ని ప్రదర్శించే క్రమంలో ఆయన హద్దులు దాటేశారు. దేశంలో నల్లధనానికి చెక్ పెట్టేందుకు మోడీ తీసుకున్న చర్యల్ని విపరీతంగా పొగిడేసిన అతగాడు.. ఇకపై ఎవరైనా అచ్చేదిన్ ఎక్కడా అని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదన్నాడు. పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీకి మోడీ అడ్డుకట్ట వేశారని.. దీంతో అచ్చేదిన్ వచ్చేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరైనా సరే అచ్చేదిన్ ఎక్కడా అని ప్రశ్నిస్తే వారిని చెప్పుతో కొడతానని హెచ్చరించటం గమనార్హం. తాను చేసిన వ్యాఖ్య నచ్చితే తనకు లైక్ కొట్టొచ్చని.. లేకుంటే తన పేజీని అన్ లైక్ చేయొచ్చంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేయటం చూస్తే.. అతగాడి తీరు ఏమిటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gaurishankar shejwar 
  • Facebook 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS