హద్దులు దాటిన గవర్నర్‌ గారి సంయమనం!

Update: 2015-06-29 11:23 GMT
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని విద్యా సంస్థల విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ సంయమనం హద్దులు దాటిపోయిందని సీమాంధ్ర నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన విద్యా సంస్థల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జోక్యం చేసుకోవాల్సిందిగా తాను ఇప్పటి వరకు మొత్తం 23 సార్లు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశానని, అయినా ఆయన కనీసం స్పందించలేదని ఏపీ విద్యా శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి ఉన్నత విద్యా మండలితోపాటు స్థానికత, ఎంసెట్‌, తెలుగు యూనివర్సిటీ తదితర వివాదాలు వస్తూనే ఉన్నాయి. విద్యార్థులు ప్రతిసారీ గందరగోళం పడుతూనే ఉన్నారు. సీమాంధ్రకు చెందిన విద్యార్థులు కొన్ని అవకాశాలను కోల్పోతూ ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలో గవర్నర్‌ జోక్యం చేసుకుని చట్టాన్ని అమలు చేసి ఉండాల్సిందని, కానీ ఆయన జోక&ంయ చేసుకోకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందని వారి తల్లిదండ్రులు వివరిస్తున్నారు.

తాను గవర్నర్‌ను 23 సార్లు కలిశానని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించిన తర్వాత కూడా గవర్నర్‌ ఆయనకు ఫోన్‌ చేశారని, ఇప్పటికి కూడా సంయమనంతో ఉండాలనే చెబుతున్నారు. తప్పితే, తప్పు ఎవరిది? చట్టాన్ని అమలు చేయడం ఎలా? రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని ఇరు రాస్ట్రాలకు చెప్పే విషయంలో కూడా ఆయన విఫలమయ్యారని అంటున్నారు. సెక్షన్‌ 8తోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌పై ఇన్ని వివాదాలు జరిగినా.. ఇన్నిసార్లు కేంద్ర హోం శాఖ దిశానిర్దేశం చేసినా, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి గవర్నర్‌ చొరవ తీసుకోకపోవడంపై సీమాంధ్రకు చెందిన నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మౌనం కొంతమందికి మేలు చేస్తోందని, మరికొందరికి అపకారం చేస్తోందని, ఈ విషయం తెలిసినా ఆయన మౌనం వీడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ గవర్నరే మౌనంగా ఉంటే అసలు ఈ సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News