కరోనా ఎఫెక్ట్: వర్క్ ఫ్రం హోం ...నెట్ లో వైరల్ అవుతున్న మీమ్స్

Update: 2020-03-18 23:30 GMT
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందటంతో ప్రపంచ దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ దెబ్బకి ప్రపంచంలోని చాలా కార్యాలయాలు మూత పడ్డాయి. అందరూ ఒకేచోట గుమ్మిగూడితే కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అన్ని విభాగాల ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని కంపెనీలు వర్క్ ఫ్రం హోం కోరాయి. నాలుగైదు రోజుల నుంచి ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. అయితే ఇంటినుంచి పనిచేసే సమయంలో వారు ఎలా ఉంటున్నారు..? ఆఫీసు మాదిరిగానే సీరియస్‌గా ఉన్నారా..? లేదంటే పనితోపాటు ఇంకేమైనా చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతోన్నాయి.

అయితే దీనికి సంబంధించి మీమ్స్ కూడా సోషల్ మీడియా లో తెగ ట్రోల్ అవుతోన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి నుంచే పని చేయాలని కోరడంతో పలు రకాల ఉద్యోగులంతా ఇంటి వద్ద నుండే పనిచేస్తున్నారు. అయితే ఆఫీసుకు వెళ్లినట్టు టిప్ టాప్ గా తయారవడం లేదు. సాధారణంగా వీకెండ్ లో ఇంట్లో ఎలా ఉంటారో అలానే లుంగీ కట్టుకొని, బనీయన్ వేసుకొని సింపుల్ గా ఉంటున్నారని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే ల్యాప్‌ట్యాప్ పెట్టుకొని.. మొహానికి మాస్క్ పెట్టుకొని వంట చేస్తోన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. దీంతో వర్క్ ఫ్రం హోం అంటే ఇంట్లో ఉండి పనిచేయడమే కాదు.. ఇంటి పని కూడా చేయడం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

కాగా , కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేయడంతో.. సీరియస్ నెస్ తగ్గడంతో తమకు ఎక్కడ నష్టాలు వస్తాయెమోనని కొన్ని కంపెనీలు బయటపడుతున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రం హోం అనే కాన్సెప్ట్ తో పెళ్లాం, పిల్లలతో జాలీగా గడుపుతూ ఇంట్లో నుండే పనిచేస్తున్నారు. కరోనా వైరస్ పుణ్యాన ఇంటిపట్టున ఉంటూనే.. పనిచేసుకొనే అదృష్టం దక్కింది అని ఆనందపడుతున్నారు. మరికొంతమంది కరెంట్ పోతుందో తెలియదని, ఇంటర్నెట్ సమస్య అని కాకమ్మ కబుర్లు చెబుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగుల వర్క్ ఫ్రం హోంకి సంబంధించి మీమ్స్ కూడా తెగ సందడి చేస్తున్నాయి. ఆఫీసులో ఉండే మాదిరిగా కాకుండా.. ఇంట్లో ఉండేలా ఉన్న ఫోటోలు కూడా తెగ ట్రోల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు కూడా పెడుతున్నారు.


Tags:    

Similar News