మండలిలో వైసీపీకి ఫుల్ మెజారిటీ
ఎట్టకేలకు ఏపీ అధికార పార్టీ వైసీపీకి శాసన మండలిలో పూర్తిస్తాయి మెజారిటీ లభించింది. తాజాగా 11 మంది ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం అయ్యారు. వీరంతా కూడా స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యారు. వాస్తవానికి అనంతపురంలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేశారు. అయితే.. చివరి నిముషంలో ఆయన తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో శుక్రవారం.. 11 మంది ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు.
ఇక, ఇదే ఎన్నికలకు సంబంధించి ఇతర జిల్లాలను చూసుకుంటే.. అక్కడ కూడా వైసీపీపై ఎవరూ పోటీ చేయలేదు. దీనికి కారణం.. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్షం టీడీపీ ఘోరమైన పరాజయం పొందింది. దీంతో పోటీ లేకుండా పోయింది. దీంతో వైసీపీ తరఫున నామినేషన్ వేసిన 11 మంది అభ్యర్తులు మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు స్పష్టం చేశారు.
ఇక, వైసీపీ తరఫున గెలిచిన వారిలో.. ఇందుకూరు రఘురామరాజు(విజయనగరం), వరుదు కళ్యాణి, వంశీ కృష్ణ(విశాఖ), అనంత ఉదయ భాస్కర్(తూర్పు గోదావరి), తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్(కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు(గుంటూరు), తూమాటి మాధవరావు(ప్రకాశం), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్(చిత్తూరు), వైఎస్ శివరామిరెడ్డి(అనంతపురం) ఉన్నారు.
ఇక, మరో ముగ్గురు ఎమ్మెల్యే కోటాలో మండలికి ఇటీవలే ఎన్నికయ్యారు. దీంతో వైసీపీ పూర్తి బలం 32కు చేరింది. మొత్తంగా మండలిలో సభ్యుల సంఖ్య 58. వీరిలో ఇటీవల వైసీపీ సభ్యురాలు, కరీమున్నీసా హఠాన్మరణం చెందారు. ఇక, నిన్న మొన్నటి వరకు టీడీపీ బలం ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు వీరి సంఖ్య 15కు చేరింది. బీజేపీ తరఫున ఒకరు, పీడీఎఫ్ సభ్యులు నలుగురు ఉన్నారు. ఇక, ఇప్పటికే మండలిని రద్దు చేస్తూ.. చేసిన తీర్మానాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో మండలి కొనసాగనుంది.