ఆవు కౌగిలింతకు ఫుల్​ డిమాండ్​.. గంటకు 75 డాలర్లు..!

Update: 2021-05-24 05:35 GMT
ఆవును మనదేశంలో పూజిస్తారు. ఈ విషయంపై అనేక వివాదాలు ఉన్నాయి అదే వేరే చర్చ. ఇదిలా ఉంటే ఆవు ఎంతో పవిత్రమైందని మనదేశ ప్రజలు నమ్ముతుంటే.. ఆవును కౌగిలించుకుంటే చాలు ఎన్నో రోగాలు దూరమవుతాయని అమెరికన్లు శాస్త్రీయంగా విశ్వసిస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో ’కవ్​ కడ్లింగ్​’ అనే పద్ధతి సాగుతుంది. ఈ పద్ధతి ప్రకారం ఆవును కౌగిలించుకుంటే.. వాళ్లకు బీపీ, శ్వాస సంబంధిత వ్యాధులతోపాటు పలు రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆవులను కౌగిలించుకోవడానికి గంటకు 75 డాలర్లు వసూలు చేస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్​ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్​ వచ్చినవాళ్లల్లో చాలా మందిలో శ్వాససంబంధిత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ‘ఆవుకడ్లండ్​’ పద్ధతి ద్వారా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవచ్చని అమెరికన్లు నమ్ముతున్నారు. నిజానికి ఈ పద్ధతి చాలా ఏళ్లుగా పాశ్చాత్య దేశాల్లో ఉన్నది. ప్రస్తుతం అమెరికాలో విస్తరించింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఐదు ఎకరాలలో ఉన్న ఐమీస్ ఫార్మ్ యానిమల్ సంక్చురి, యునైటెడ్ స్టేట్స్ లోని అగ్ర జంతు అభయారణ్యాలలో ఒకటిగా గుర్తింపు సాధించింది. ఇక్కడికి అమెరికన్లు క్యూ కడుతున్నారు. ఆవును కౌగిలించుకొని ఆనందం  పొందుతున్నారు.అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుండటం గమనార్హం.

ఆవు కడ్లింగ్ ద్వారా శ్వాసకోశ వ్యాధులు, రక్తపోటు, వెన్నెముక నొప్పి, గుండె సమస్యలతో పాటు.. డిప్రెషన్​, మానసిక సమస్యలు,  విచారం, ఆందోళన వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు.  తల్లి-ఆవు హృదయ స్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దాని వద్ద ప్రశాంతత లభిస్తుంది. ఈ పద్ధతిని ‘ఆవు-కమ్యూనికేషన్’ లేదా ‘ఆవు తల్లితో కమ్యూనికేషన్’ అని పిలుస్తారు.సాధారణంగా పసికందులు తల్లి ఒడిలో నిద్రించడం ఎంతో మంచింది. వారు ఆ టైంలో మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఆవును కౌగిలించుకున్నప్పుడు కూడా మనుషులకు ఎంతో రిలాక్సేషన్​ వస్తుందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మూఢ నమ్మకం కాదని.. శాస్త్రీయంగా నిరూపించబడిందని వారు చెబుతున్నారు.
Tags:    

Similar News