వ్యభిచారం కోసం బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ .. దేశంలో తొలిసారి !

Update: 2020-08-21 07:30 GMT
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి తో అతలాకుతలం అవుతున్నా కూడా కొందరు మాత్రం ఏ మాత్రం భయం అనేది లేకుండా యథేచ్ఛగా తమ అక్రమాలని కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేసే వారు ఏ మాత్రం వెనుకడుగు వేయడంలేదు.  మంచి ఉద్యోగం , మంచి జీతం అని నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ ఊబిలోకి దించుతున్నారు. దీనిపై ఎన్ ఐ ఏ కీలక నిర్ణయం తీసుకుంది.  ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్‌ నుంచి యువతులను అక్రమంగా భారత్‌లోకి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసింది.  ఆరుగురిని నిందితులుగా గుర్తించిన ఎన్ ఐ ఏ వారికి సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను సేకరించి ఛార్జిషీటుగా పొందుపరిచింది. ఇలా మనుషుల అక్రమ రవాణా పై ఎన్ ఐ ఏ కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి.

ఉపాధి పేరుతో బంగ్లాదేశ్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు 2019లో ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది. వ్యభిచార ముఠా నుంచి బంగ్లాదేశ్ అమ్మాయిలను పోలీసులు రక్షించారు. అయితే హైదరాబాదులో పనులున్నాయని చెప్పి బంగ్లాదేశ్ అమ్మాయిలను ముఠా తీసుకు వస్తున్నట్టు వారు గుర్తించారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత  బలవంతంగా ఈ ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ముఠా బారిన పడ్డ యువతుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ నుంచి పెద్దమొత్తంలో అమ్మాయిలను తీసుకొచ్చి ఈ  ముఠా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే , ఇది మానవ అక్రమ రవాణా వ్యవహారంగా గుర్తించిన ఎన్ ఐ ఏ రంగంలోకి దిగింది. ఈ కేసును తానే స్వయంగా దర్యాప్తు చేపట్టింది. అన్ని ఆధారాలు సేకరించిన అధికారులు తాజాగా న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Tags:    

Similar News