వైరల్: తోటి ప్రయాణికులపై ఫ్లైట్ లో దగ్గుతూ భయపెట్టింది

Update: 2020-10-21 10:30 GMT
కరోనా భయం జనాలను ఆవహించింది. ఇప్పుడు ఎక్కడ ఎవరు దగ్గినా, తమ్మినా వింతగా చూస్తున్నారు. వారిని వెలివేస్తున్నారు. మాస్క్ లేకుండా ఇప్పుడు ఎవరూ బయటకు రావడం లేదు. ప్రయాణాల్లో అయితే మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మాస్క్ లేకుంటే ఇప్పుడు బయట ప్రయాణించడానికి వీళ్లు లేకుండా నిబంధనలు ఉన్నాయి. బస్సు, రైలు, ఫ్లైట్ లో మాస్కులు ఇంకా శానిటైజర్, చేతికి గ్లౌజులు సహా ప్రయాణికులు సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కానీ తాజాగా ఓ మహిళ మాత్రం విమానంలో మాస్కు లేకుండానే ఎక్కేసింది. అంతటితో ఆగకుండా కావాలని గట్టిగా అరుస్తూ దగ్గుతూ అందరూ చస్తారు అంటూ శాపనార్థాలు పెట్టింది. ఈ ఘటన ఉత్తర ఐర్లాండ్ నుంచి స్కాట్ లాండ్ వెళుతున్న ఈజీ జెట్ విమానంలో చోటుచేసుకుంది.

టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో ఓ మహిళా మాస్కు లేకుండా ఎక్కగా సిబ్బంది ఆమెను దిగిపోవాలని సూచిస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన సదురు మహిళ తోటి ప్రయాణికుల ముఖాల్లోకి తొంగి చూస్తూ కావాలని దగ్గింది.  ‘అందరూ చస్తారు. కరోనానే కావచ్చు.. ఇంకేదైనా కావచ్చు. ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది’ అంటూ పదే పదే అరిచింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Full ViewFull View
Tags:    

Similar News