ఫుట్ బాల్ గ్రౌండ్ లో గొడవ..ప్రత్యర్థి ప్లేయర్ ది కొరికేసిన ప్లేయర్

Update: 2020-02-20 10:15 GMT
విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. అసలు ఇలా కూడా జరుగుతుందా? అన్న విస్మయానికి గురి కావటం ఖాయం. అలాంటి ఉదంతమే ఒకటి కొద్ది నెలల క్రితం చోటు చేసుకుంది. జరిగిన దారుణంపై విచారణ జరిపిన కమిటీ తాజాగా తన తీర్పును బయటపెట్టటం.. అప్పట్లోజరిగిన ఈ ఉదంతం మరోసారి చర్చకు వచ్చింది.

2017 నవంబరు 17 ఫ్రాన్స్ కు చెందిన టెర్విల్లే.. సోట్రిచ్ జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. గేమ్ డ్రాగా ముగిసింది. ఆట తర్వాత రెండు జట్ల సభ్యుల మధ్య కారు పార్కింగ్ వద్ద గొడవ మొదలైంది. టెర్విల్లే జట్టుకు చెందిన ఒక ఆటగాడు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కోపానికి గురైన సోట్రిచ్ జట్టు ఆటగాడు టెర్విల్లే జట్టుకు చెందిన ఆటగాడి పురుషాంగాన్ని బలంగా కొరికేశాడు.

ఆటలో గొడవ గ్రౌండ్ బయటా మామూలే కానీ.. ఇలాంటి సీన్ ఏ మాత్రం ఊహించని వారికి షాక్ తగిలినట్లైంది. బాధితుడికి తీవ్రగాయం కావటంతో అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొరికిన చోట పది కుట్లు పడ్డాయి. ఈ ఘటన సంచలనం గా మారింది. ఈ ఉదంతం పుట్ బాల్ క్రమశిక్షణా కమిటీ సీరియస్ గా తీసుకుంది. మూడు నెలల విచారణ తర్వాత తాజాగా తన చర్యల్ని వెల్లడించింది. ప్రత్యర్థి పురుషాంగాన్ని కొరికిన ఆటగాడిని ఐదేళ్లు.. బాధితుడ్ని ఆర్నెల్లు ఫుట్ బాల్ గేమ్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News