నాలుగుసార్లు ఎమ్మెల్యే - సొంతిల్లు లేదు - సైకిల్ కూడా లేదు!

Update: 2020-11-14 10:50 GMT
ఎమ్మెల్యే ... ఒక్కసారి ఎమ్మెల్యే గా గెలిస్తే చాలు , తరతరాలకు సరిపోయేంత , తరగనంత ఆస్తి సంపాదిస్తున్న ఈ రోజుల్లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఉండేందుకు గూడు కట్టుకోలేకపోయారు బీహార్‌కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే  మహబూబ్ ఆలమ్. ఆయన గురించి తెలిస్తే ఈ రోజుల్లోనూ ఇటువంటి ప్రజానేత ఉంటారా అని అనిపించకమానదు . ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో మహబూబ్ గెలుపొందారు. కోసి ప్రాంతంలోని కటిహార్ జిల్లా బలరామ్ ‌పూర్ నుంచి మహబూబ్ నాలుగో సారి విజయం సాధించారు. ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పటికీ నడుచుకునే వెళ్తుండడం మరో ప్రత్యేకత.

బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 81 శాతం మంది కోటీశ్వరులుండగా, సొంతిల్లు కూడా లేని ఎమ్మెల్యే ఈయన ఒక్కరే. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న మహబూబ్ మొన్నటి ఎన్నికల్లో 53 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పోటీచేసిన ఆలమ్.. నాల్గోసారి విజయం సాధించారు.

వికాశ్‌ షీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి వీరేంద్ర కుమార్ ఓజాపై 53 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి విజయం సాధించిన సీపీఎం ఎమ్మెల్యేలో ఆలమ్ ఒకరు. ఆ ఎన్నికల్లో జేడీయూ- కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి, బీజేపీతో కూడిన ఎన్‌ డీఏ పోటీచేశాయి.  2015 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరౌన్ కుమార్‌పై 20,419 ఓట్లతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 31.7 శాతం ఆలమ్‌‌ కు దక్కాయి.
Tags:    

Similar News