కర్నూలు లో విషాదం : రైలు కిందపడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య !

Update: 2020-11-03 15:30 GMT
కర్నూలు‌ జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాణ్యం మండలంలోని కౌలూరులో రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు ఆత్మహత్య ‌ చేసుకున్నారు.  ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

నంద్యాల రోజా కుంట ప్రాంతానికి చెందిన గఫార్‌ మంగళవారం మధ్యాహ్నం భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో నంద్యాల నుండి  ప్రాణ్యం మండలం కౌలూరు వద్దకు వచ్చాడు. గూడ్స్ ‌ రైలు కింద పడి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గఫార్‌ గతంలో ఓ బంగారం దుకాణంలో చోరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. కేసు విచారణ నిమిత్తంతొ పలుమార్లు పోలీసులు విచారించారు. కేసు చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంపై అనేక అనుమాలకు దారితీస్తున్నాయి. మరోవైపు పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.  కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో రోజాకుంట ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Tags:    

Similar News