బెంగాల్ లో అలజడి.. యుద్ధవాతావరణం

Update: 2019-06-09 06:53 GMT
సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పు-నిప్పుగా కొట్లాడుతున్న నరేంద్రమోడీ-మమతా బెనర్జీల మధ్య ఎన్నికలు ముగిశాక కూడా వేడి చల్లారడం లేదు. బెంగాల్ లో అధికార తృణమూల్ - ప్రతిపక్ష బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల వేళ దాడులు.. ప్రతిదాడులతో రెచ్చిపోయిన తృణమూల్-బీజేపీ నాయకులు ఇప్పుడు ఎన్నికల ముగిశాక కూడా హింసను కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా బెంగాల్ లోని నజత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురికావడం కలకలం రేపింది. శనివారం రాత్రి బీజేపీ-తృణమూల్ కార్యకర్తల మధ్య హింస చెలరేగింది. నజత్ లో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ల కారణంగా గొడవ జరిగింది. దీంతో అభ్యంతరం చెప్పిన తృణమూల్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఇది నలుగురు బీజేపీ కార్యకర్తల హత్యకు దారితీసింది.

ఇక బెంగాల్ లో నలుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురికావడంపై బీజేపీ సీరియస్ గా స్పందించింది. సీనియర్ బీజేపీ నేత ముకుల్ రాయ్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తల హత్యకు మమతనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక తాజాగా నలుగు బీజేపీ కార్యకర్తల హత్యతో బెంగాల్ అట్టుడుకుతోంది. బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తాజా ఘటనతో రాష్ట్ర పోలీస్ శాక ఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

    

Tags:    

Similar News