అంబులెన్స్ నిప్పు పెట్టిన మాజీ రౌడీ షీటర్ !

Update: 2020-09-16 08:50 GMT
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీషీటర్‌ సురేష్‌ విద్వంసం సృష్టించాడు. అంబులెన్స్ కి  రాంగ్ ‌కాల్స్‌ చేస్తుండటంతో , 108  సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సురేష్‌ ను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌ ను తీసుకెళ్లారు. ఈరోజు తెల్లవారు జామున సురేష్‌  వింతగా ప్రవర్తిస్తూ..పోలీస్‌ స్టేషన్‌ కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశాడు. ఈఘటనలో అతని చేతికి గాయాలవడంతో ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రి కి తరలించేందుకు 108 అంబులెన్స్‌ ను అక్కడికి  తీసుకువచ్చారు. ఆ అంబులెన్స్ లో ఎక్కించి , ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో  తన వద్ద ఉన్న అగ్గిపెట్టె తో 108 వాహనానికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన లో 108 వాహనం పూర్తిగా కాలి పోయింది.  ఆ తరువాత అంబులెన్స్ నుండి తప్పించుకు పోయాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీ లో ఉన్న రౌడీ షీటర్ కోసం గాలిస్తున్నారు.
Tags:    

Similar News