దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంపై సంతోషం వద్దన్న ఆర్ బీఐ మాజీ గవర్నర్
ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాహన గల్లీల్లో నుంచి మొయిన్ రోడ్డు మీదకు ఎక్కిన తర్వాత వేగం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అదే సమయంలో.. ఏ క్షణంలో అయినా బ్రేక్ పడేందుకు అవకాశం ఉంది. అలాంటిదేమీ లేకుండా సాఫీగా సాగుతున్న ప్రయాణానికి అనుకోని రీతిలో సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందనుకోండి? అప్పుడేమవుతుంది? సడన్ బ్రేక్ వేసిన షాక్ కాసేపు ఉంటుంది. మామూలు బ్రేక్ వేసిన దానికి.. సడన్ బ్రేక్ వేసిన దానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా? అందుకే.. బ్రేక్ వేసిన తర్వాత వాహన బయలుదేరే దానికి.. సడన్ బ్రేక్ వేసిన తర్వాత వాహన ప్రమాణానికి తేడా ఉంటుంది కదా? కరోనా నేపథ్యంలోనూ దేశ ఆర్థిక పరిస్థితి ఇంచుమించు ఇంలాంటి పరిస్థితే నెలకొంది.
లాక్ డౌన్ లాంటి సడన్ బ్రేక్ తో ఒక్కసారిగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు ఒకటిన్న నెల వరకు ఎక్కడి వారు అక్కడే ఉండిపోవటం.. గడిచిన వందేళ్లలో ఇలాంటి పరిస్థితి ఏర్పడకపోవటంతో ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి. ఇటీవల కాలంలో వైరస్ మీద వార్ లాంటి అలవాటు ప్రపంచానికి.. దేశానికి లేకపోవటంతో కుదురు కోవటానికి కాస్త టైం పట్టింది.
ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడున్న పరిస్థితి మీద ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చెప్పుకొచ్చారు ఆర్ బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. లాక్ డౌన్ సడలింపులు మొదలైన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. అవేమంటే..
- స్వల్పకాలం నుండి మధ్యకాలానికి భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల కొంత సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటి గురించి మరీ ఎక్కువగా స్పందించొద్దు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అన్-లాక్ కావడంతో ఎంతో కొంత కోలుకుంటున్నట్లు కనిపించడం సహజమే. ఇది కొనసాగుతుందని అనుకోలేం.
- లాక్ డౌన్ సమయంలో పూర్తిగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలు, ఇప్పుడు కాస్త సానుకూలంగా కనిపించడాన్ని యాంత్రికంగా కోలుకోవడంగా చెప్పొచ్చు. దీనిని చూసి కరోనా నుండి బయటపడి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, అభివృద్ధి బాటలోకి ఎక్కినట్లు ఇప్పుడే భావించడం సరికాదు.
- ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎంత సమర్థంగా ఎదుర్కోగలమనే అంశంపై ఆర్థిక పునరుజ్జీవనం ఆధారపడి ఉంటుంది. కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ కాస్త క్షీణించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7%, 2018-19లో 6.1% కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి 4.2% పడిపోయిందని మర్చిపోకూడదు.
- సానుకూల సంకేతాలపై మితిమీరిన ఆశలు వద్దు. లాక్‌డౌన్ అనంతర కాలంలో ఏర్పడిన యాంత్రికమైనది. అది దీర్ఘకాలిక రికవరీ సంకేతంగా భ్రమింపచేస్తోంది. కరోనా పూర్తిగా మాయమయ్యే సమయానికి ప్రస్తుత సమస్యలు మరింత పెద్దగా కనిపిస్తాయి. ద్రవ్య లోటు, రుణభారం భరించలేని భారంగా మారడంతో పాటు ఆర్థిక పరిస్థితి జఠిలంగా ఉండవచ్చు.
- రోజువరీ కేసుల సంఖ్య పెరగడంతో పాటు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. స్వల్పకాలం నుండి మధ్యకాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక సవాళ్లను ఎలా పరిష్కరించుకుంటామనే దానిపై మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
- ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వృద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు క్షీణించాయి. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం మరింత ఖర్చు చేయాలి. లేదంటే మొండి బకాయిలు సహా పలు ఆర్థిక సమస్యలు వస్తాయి.
- ప్రస్తుత నిరాశ, నిస్పృహ పరిస్థితుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం మాత్రమే చిరుదివ్వెగా కనిపిస్తోంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో రికవరీ బాగుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాది హామీ పథకం సహా పలు కారణాలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్య.
- మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండటాన్ని తక్కువమంది గుర్తించటం మరో సానుకూల అంశం. నాలుగు కోట్లకు పైగా పట్టణ కార్మికులు గ్రామాల్లోకి వెళ్లారని, కానీ అక్కడ భారీ కేసులు నమోదు కాకపోవటం సానుకూల అంశం.