• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'గడప గడపలో'.. మాజీ...

'గడప గడపలో'.. మాజీ మంత్రికి ప్రజల నుంచి సెగలే!

By - Tupaki Desk
Update: 2022-05-27 07:30 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ప్రజలను చుట్టేస్తున్నాయి. అధికార వైఎస్సార్‌సీపీ ఇప్పటికే ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధిని వివరిస్తున్నారు. ఎంత మేర లబ్ధి పొందారో తెలుపుతూ ఒక కరపత్రాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా మరోసారి తమను గెలిపించి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన లేఖను ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు.

అయితే.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు, నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. వివిధ సమస్యలపై ఎక్కడకక్కడ గట్టిగా నిలదీస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. మురుగు సమస్య ఉందని.. తాగునీరు లభించడం లేదని.. స్మశానానికి దారి లేదని ఇలా రకరకాల సమస్యలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యతిరేకతను అస్సలు ఊహించని వైఎస్సార్‌సీపీ నేతలు బిత్తరపోతున్నారు. తమపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారు.

ఈ నిరసనలను ముందుగానే ఊహించే రాష్ట్ర ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి గడప గడపకూ వైఎస్సార్‌సీపీ అనే పేరును మార్చి గడపకు గడపకూ మన ప్రభుత్వం అని పెట్టింది. తద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పార్టీపై పడకుండా చర్యలు చేపట్టింది. అయినా కార్యక్రమం పేరు మార్చినప్పటికీ వైఎస్సార్‌సీపీ నేతల నుంచి ప్రజలకు నిరసనలు తప్పడం లేదు.

తాజాగా మాజీ మంత్రి శంకర్ నారాయణ చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఆయనకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఎక్కడకు వెళ్ళినా ఏ మండలంలో పర్యటించినా శంకర్ నారాయణను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పరిగి మండలం చెర్లోపల్లి గ్రామంలో గెలిచిన మూడేళ్లకు తాము గుర్తుకు వచ్చామని ప్రజలు ఆయనను నిలదీశారు. తమ గ్రామంలో త్రాగు నీరు, అంగన్ వాడీ కేంద్రం, రహదారులు లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వచ్చారా అంటూ గ్రామ ప్రజలు, యువకులు శంకర్ నారాయణపై మండిపడ్డారు. దీంతో ఆయన చేసేదేమీ లేక, వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుండి జారుకున్నారు.

అలాగే పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండలంలోని కావేటి నాగేపల్లిలో వాలేంటర్ పై మాజీ మంత్రి శంకర్ నారాయణ దాడి చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. వలంటీర్ ను కొట్టటానికి శంకర్ నారాయణ చేయి ఎత్తగా నన్ను కొట్టటానికి నువ్వు ఎవరు అంటూ వలంటీర్ ఎదురుతిరిగాడు.

గోరంట్ల మండలం గంగంపల్లి పంచాయతీ గోపి దేవరపల్లిలోనూ శంకర్ నారాయణకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక గిరిజన మహిళ ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి ప్రభుత్వ రాయితీలు అందలేదని ఆయనను ఏకవచనంతో నిలదీసింది. ఇలా పెనుకొండ నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా మాజీ మంత్రి శంకర్ నారాయణకు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆయన అన్ని గ్రామాలు తిరగకుండా తూతూమంత్రంగా రెండు గ్రామాలు తిరిగి వెళ్లిపోతున్నారు.

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ ను, అద్దంకి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్యను కూడా ప్రజలు ఇలాగే నిలదీశారు.


Full View
Tags:    
  • AP 
  • ycp 
  • FormerMinister 
  • ShankarNarayana 
  • ysrcp 
  • andhrapradesh 
  • tupakinews 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS