బ్రేకింగ్: కరోనాతో మాజీ సీఎం మృతి
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో ఫూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శివాజీరావు మరణించారు.
శివాజీరావుకు ఇటీవలే కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.
అయితే కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు తెలిపారు.
శివాజీరావుకు ఇప్పటికే మధుమేహం, బీపీ ఉంది. దానికి తోడు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మరణించాడని వైద్యులు వివరించారు.
1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావు పాటిల్ మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు.