• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వన్డే చరిత్రలోనే తొలి...

వన్డే చరిత్రలోనే తొలి వికెట్ టేకర్ కన్నుమూత.. అతడి రికార్డులెన్నో?

By - Tupaki Desk
Update: 2022-11-02 11:30 GMT
క్రికెట్ చరిత్రల్లో వన్డేల్లో తొలి వికెట్ టేకర్ గా ఖ్యాతి గడించిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని అతడి సోదరుడు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.  మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించాడని తెలిపాడు.

అలెన్ థామ్సన్ కు కొద్దిరోజుల క్రితం జారి పడడంతో తుంటి గాయానికి చికిత్స జరిగింది. అప్పటి నుంచి పరిస్తితి మెరుగుపడలేదు. ఆఖరికి అలాన్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడు.

విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరుఫున ఒక వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచులు మాత్రమే ఆడాడు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించాడు. అదేవిధంగా అతడి బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. క్రికెట్ లో ఇతడిని ముద్దుగా 'ఫ్రాగీ' అని పిలుస్తారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ లో విక్టోరియా తరుఫున 44 మ్యాచ్ లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ వన్డే చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. మెల్‌బోర్న్ టెస్టులో ప్రతికూల వాతావరణం కారణంగా, ఆస్ట్రేలియా - ఇంగ్లండ్‌లు  ఎంసీజీ గ్రౌండ్ లో ప్రపంచంలోని మొదటి వన్డేని ఆడాయి .

థామ్సన్ మ్యాచ్‌లో మొదటి వికెట్‌ను తీసుకున్నాడు, అతను ఒక పుల్‌ను మిస్‌క్యూ చేసిన జియోఫ్ బాయ్‌కాట్‌ను ఔట్ చేశాడు. స్క్వేర్ లెగ్ వద్ద బిల్ లారీకి కాల్చాడు. ఆస్ట్రేలియా గెలిచిన 40 ఓవర్ల మ్యాచ్‌లో అతను తన ఎనిమిది ఓవర్లలో 22 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో తొలి వికెట్ అసీస్ కు ప్రాతినిధ్యం వహించిన అలాన్ థామ్సన్ కు దక్కింది. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్ గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Australian 
  • FastBowler 
  • AlanThomson 
  • Cricket 
  • Froggy 
  • England 
  • Cricketmatch 
  • PoliticalNews 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS