బావ కళ్ళల్లో ఆనందం కోసం...
ఓ అక్క..బావ..ఓ బామ్మరిది ఇదేదో సినిమా టైటిల్లాగుంది వినటానికి, చదవటానికి. అవును బోయినపల్లి కిడ్నాప్ గా బాగా పాపులరైన పదిరోజుల క్రితం కిడ్నాప్ కథలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అండ్ కో ముగ్గురు రియల్టర్ సోదరులను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడా కిడ్నాప్ భాగస్వాముల్లో అఖిల సోదరుడు భూమా జగద్విఖ్యాతరెడ్డి కూడా తోడయ్యాడు. చివరకు పోలీసుల ఎఫ్ఐఆర్ తో బుక్కయ్యాడు.
రియాల్టర్లను ఎందుకు కిడ్నాప్ కు ప్రయత్నించారంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే అని చెప్పాడట. కిడ్నాప్ వ్యవహారంలో అక్క భూమా అఖిలప్రియ, బావ భార్గవరామ్ కు ఎంత పాత్రుందో బావమరిది జగద్విఖ్యాత్ కు కూడా అంతే భాగస్వామ్యం ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారట. ఎందుకంటే కిడ్నాప్ సమయంలో బావమరిది తన కారులో కిడ్నాప్ కు గురైన సోదరుల ఇళ్ళకు దగ్గరలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తన కారులో డ్రైవర్ ను దగ్గరే పెట్టుకుని బావకు సాయంగా ఉంటుందని జగద్విఖ్యాత్ ఘటనా ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. బావమరిది వాడిన మొబైల్ నెంబర్ సాయంతో కిడ్నాప్ జరిగిన రాత్రి లొకేషన్ను పోలీసులు గుర్తించారని సమాచారం. అలాగే తర్వాత డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నపుడు డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగానే జగద్విఖ్యాత్ కూడా కిడ్నాప్ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
బంధులను కిడ్నాప్ చేసిన విషయంలో కూడా బావ-మరుదులు భార్గవ్, జగద్విఖ్యాత్ పై గతంలోనే ఆరోపణలు వినిపించాయి. ఆళ్ళగడ్డలోని ఓ మిల్క్ డైరీ ఛైర్మన్ పదవి విషయంలో సొంత బంధులతోనే వీళ్ళు గొడవలు పడ్డారు. బంధువైన ఛైర్మన్ను కిడ్నాప్ చేయటానికి ఆమధ్య ప్రయత్నించారు. అయితే అప్పుడు కూడా ఫెయిలయ్యారు. అయితే ఆ ఘటన పోలీసుల దాకా వెళ్ళకుండానే బంధువుల మధ్యే సర్దుబాటైందని సమాచారం. అంటే వీళ్ళిద్దరికీ కిడ్నాపులన్నది మొదటి వ్యవహారం కాదని అర్ధమైపోతోంది.