తిరుపతిలో కేసీఆర్ కు పోస్టర్లు ఏసేశారు

Update: 2017-02-20 16:10 GMT
మరెక్కడా లేని అభిమానాన్ని ప్రదర్శించి అందరూ అవాక్కు అయ్యేలా చేస్తున్నారు ఆంధ్రోళ్లు. తమను వెనకా ముందు లేకుండా తిట్టేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రజలు కొందరు ప్రదర్శిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ఎవరైతే రాష్ట్రవిభజనకు కారణం అయ్యారో.. ఆ వ్యక్తికి ఘనంగా స్వాగతం పలికే విలక్షణమైన అభిమానం ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరికి సొంతమని చెప్పుకోవాలి.

మొన్ననే కేసీఆర్ 63బర్త్ డే వేడుకల్ని ఏపీలోని తెనాలితోపాటు.. మరికొన్నిప్రాంతాల్లో జరపటం.. ఆ సందర్భంగా కేక్ కట్ చేసి.. వివిధ సేవా కార్యక్రమాల్ని నిర్వహించటం తెలిసిందే. ఈ అభిమానం గురించి అందరూ మాట్లాడుకుంటున్నవేళ.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  రేపు (మంగళవారం) రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకొని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని దర్శించుకొని.. ఆయనకు తెలంగాణ మొక్కుల్ని కేసీఆర్ తీర్చుకోనున్న సంగతి తెలిసిందే.
Read more!

ఈ సందర్భంగా కేసీఆర్ తిరుమల రాకను పురస్కరించుకొని.. ఆయనకు స్వాగతం పలుకుతూ.. తిరుపతి వీధుల్లో పోస్టర్లు ప్రత్యక్షం కావటం విశేషం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలుకుతున్న ఈ పోస్టర్లు తిరుపతి పట్టణంలో ప్రత్యేక చర్చకు తెర తీశాయి. కేసీఆర్ రాకకు ముందే ఇంతటి అభిమానాన్ని పదర్శించే వారు.. ఆయన వస్తున్న రోజున ఏకంగా కటౌట్లు ఏర్పాటు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News