‘ఫైవ్‌స్టార్’చెఫ్ .. రోడ్డుపక్కన బిర్యానీ అమ్ముకుంటున్నాడు.. అంతా కరోనా మహిమ..!
అతడు ఫైవ్‌స్టార్ హోటల్లో చెఫ్. ఓ పదిమందిదాకా ఆయన చేతికింద పనిచేసేవారు. అతడి చేతివంట కోసం పెద్ద పెద్ద వాళ్లు వచ్చేవారు. ఎందరో సెలబ్రిటీలు ఆయనను కలుసుకున్నారు. ఎందరో యువచెఫ్లు అతడి వద్ద మెలకువలు నేర్చుకున్నారు. అతడే మహారాష్ట్రకి చెందిన అక్షయ్ పార్కర్. కానీ కరోనా దెబ్బకు పరిస్థితి తలకిందులైంది. గిరాకీలు లేక హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసే పరిస్థితి వచ్చింది. అక్షయ్‌ను కూడా వాళ్ల రెస్టారెంట్ ఇంటికి పంపించేసింది.
ఇంతకాలం ఆ రెస్టారెంట్ కు ఎన్నోలాభాలు తెచ్చిపెట్టాడు. వాళ్లకు కూడా అక్షయ్‌ను వదులుకోవడం ఇష్టం లేదు. కానీ తప్పనిసరిపరిస్థితుల్లో ఇంటికి పంపించేశారు. అయితే అక్షయ్ దీన్ని అవమానంగా ఫీల్ కాలేదు. పరిస్థితులు అనుకూలించడం లేదని ఖాళీగా కూర్చోలేదు. తానే సొంతంగా రోడ్డుపక్కన ఓ బిర్యాని బండిని పెట్టాడు.
తాజ్ ఫ్లైట్ సర్వీస్‌తో పాటు ప్రిన్సెస్ క్రూయిజ్‌లో పనిచేసిన అక్షయ్ ఇప్పుడో చిన్న స్టాల్‌ను పెట్టుకున్నాడు. ముంబైలోని దాదర్‌లో జేకే సావంత్ మార్గ్ ప్రాంతంలో ఓ స్టాల్‌పెట్టి బిర్యానీ అమ్ముకుంటున్నాడు. అయితే ప్రస్తుతం ఇతడి స్టోరీ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆయన స్టాల్ వద్ద బిర్యానీకి రేట్ మాత్రం కాస్త ఎక్కువే పెట్టాడు. కిలో వెజ్ బిర్యానీ రూ. 800, కిలో నాన్‌వెజ్ బిర్యానీ అయితే రూ. 900. ఎంతైనా పెద్ద చెఫ్ కదా..! రేట్ ఆ మాత్రం పెట్టొచ్చులే అంటున్నారట అక్కడికి వచ్చినవాళ్లు. కాగా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ గా పని చేసిన వ్యక్తి చివరికి రోడ్డుపైన బండి పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. కరోనా తెచ్చిన మహిమ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.