సిక్కు మెరైన్‌ కు తలపాగా.. అమెరికా 250 ఏళ్ల చరిత్రలో తోలిసారి

Update: 2021-09-29 01:30 GMT
ఆదాయం కోసం ఏ దేశం వలస వెళ్లినా , ఎక్కడ జీవించినా భారతీయులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు, విడిచిపెట్టరు. విదేశాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు. తాతలు తండ్రులు వారసత్వాన్ని నిలబెడతారు. విదేశాలలో స్థిరపడి ఆయా దేశాల్లో ఉన్నతస్థాయికి చేరారు ఎంతోమంది భారతీయులు. అలా అమెరికా భద్రతాదళంలో సబ్ మెరైన్ లెఫ్టినెంట్ స్థాయికి చేరుకున్నారు భారత్ నుంచి వలస వచ్చిన అమెరికాలో స్థిరపడిన సిక్కు యువకుడు సుఖ్ బీర్.

సిక్కులు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది వారి ఆహార్యంలోని తలపాగా చాలా ఆకర్షణీయంగా, అందంగా..హుందాగా ఉంటుంది సిక్కులు ధరించే తలపాగా. ఆ తలపాగాయే సుఖ్ వీర్ కు మెరైన్ లెఫ్ట్ నెంట్ డ్యూటీలో సమస్య అయ్యింది. సాధారణ డ్యూటీలో ఉండగా తలపాగా ధరించవచ్చు గానీ, అదే ఘర్షణాత్మకమైన అంటే సీరియస్ కండిషన్ కావచ్చు. ఇతర దేశాలపై జరిగే దాడుల విషయంలో కావచ్చు ఇలా కొన్ని సందర్భాల్లో సుఖ్ వీర్ తలపాగా ధరించవద్దనే సూచనలు వచ్చాయి.

దీంతో పరిమితులు విధిస్తే కోర్టుకెళతానని 26 ఏళ్ల అమెరికా మెరైన్ ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ సుఖ్‌బీర్‌ తెలిపారు. ఈక్రమంలో సుఖ్ వీర్ కు తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. ఎంతో పేరున్న అమెరికా మెరైన్‌ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఇలాంటి అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావటం విశేషం. కాగా,సుఖ్ వీర్ కాలేజీ చదువు పూర్తయ్యాక 2017లో మెరైన్స్‌ లో చేరారు. ఫస్ట్‌ లెఫ్టినెంట్‌ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్‌ గా ప్రమోషన్‌ అందుతుందని సుఖ్‌ బీర్‌ సింగ్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రమోషన్ వచ్చాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలని కోరుతు కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

భారత్‌ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్‌ బీర్‌ కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు. కానీ, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు ఆయన తలపాగా ధరిస్తే ఇతరులు గుర్తుపడతారు అని మెరైన్‌ వర్గాలు అంటున్నాయి. మఖ్యంగా యుద్ధం జరిగే సమయాల్లో ఆయన తలపాగా ధరిస్తే ప్రత్యర్ధులు చాలా ఈజీగా ఆయన్న గుర్తు పట్టవచ్చని అది ప్రమాదమని మెరైన్ వర్గాల భావన. యుద్ధ సమయాల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీం స్పిరిట్‌కు ఏకరూపకత  అవసరమని అంటున్నాయి. దీనిపై సుఖ్‌బీర్‌ చేసిన వినతిని మెరైన ఉన్నత వర్గాలు తిరస్కరించాయి. దీంతో సుఖ్ వీర్ కోర్టుకు వెళతానని చెప్పటంతో అనుమతి కల్పించినట్లుగా తెలుస్తోంది. కాగా.. అమెరికా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లలో సిక్కులు సుమారు 100 మంది ఉండగా, వారంతా తలపాగా ధరించేందుకు, జట్టు పెంచుకోవటానికి అనుమతి ఉంది.
Tags:    

Similar News