వాట్సాప్ తలాక్.. భర్తపై తొలి కేసు..
తరతరాలుగా సంప్రదాయం మాటున ముస్లిం మహిళలకు తలాక్ లు చెబుతూ విడాకులు తీసుకుంటున్న భర్తల ఆగడాలకు కేంద్రం ‘ట్రిపుల్ తలాక్’ చట్టంతో చెక్ చెప్పింది. హిందుత్వ బీజేపీ తీసుకొచ్చిన ఈ చట్టంపై ముస్లిం మహిళలంతా హర్షం వ్యక్తం చేసి మోడీకి క్షీరాభిషేకాలు చేయడం విశేషం.
ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చినా కొందరి బుద్ది మాత్రం మారడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని ఓ భర్త తన భార్యకు వాట్సాప్ లో తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. ఈ వ్యవహారంపై రగిలిపోయిన భార్యమణి వాట్సాప్ స్క్రీన్ షాట్ లు తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దేశంలో తలాక్ చెప్పిన భర్తపై తొలి కేసు నమోదైంది.
ముంబైలోని ముంబ్రా పరిధిలోని ఓ మహిళ ఎంబీఏ పూర్తి చేసింది. మొదటి భర్తతో విడిపోయి 2015 సెప్టెంబర్ 7న మరొకరిని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటి నుంచి భర్త, అత్తమామల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కావడంతో 2017లో తన తండ్రివద్దకు వెళ్లిపోయింది. ఈమె వెళ్లిపోవడంతో భర్త మరో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడట.. వారి మధ్య వాట్సాప్ లో మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.
తాజాగా గురువారం రాత్రి వాట్సాప్ లోనే భర్త తలాక్ చెప్పాడు. ప్రస్తుతం దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి రావడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆధారాలు చూపించింది. దీంతో పోలీసులు ఆ భర్తను అదుపులోకి తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ చట్టం మంగళవారం రాత్రి రాజ్యసభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం.. గెజిట్ కూడా విడుదలై చట్టం రూపం దాల్చింది. ఈనేపథ్యంలో తలాక్ చట్టం ప్రకారం ఆ భర్తకు మూడేళ్ల వరకు బెయిల్ లభించదు. కోర్టులో కూడా బెయిల్ కోసం దరాస్తు చేసుకునే వెసులుబాటును ఆ భర్త కోల్పోతాడు.ఇలా మహారాష్ట్రలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు దేశంలోనే మొట్టమొదటిదిగా నమోదైంది.