అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం

Update: 2020-08-26 05:35 GMT
వర్షాకాలంలోనూ అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవలే శ్రీశైలం విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు అంటుకోగా.. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  అప్రమత్తమైన సిబ్బంది.. కేకలు పెట్టారు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న రికార్డ్ రూమ్ పక్కనే కరోనా ఐసోలేషన్ వార్డు ఉంది.  ఆ వార్డులో 30 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. దీంతో హడావుడిగా వారందరినీ వేరే వార్డుకు తరలించారు. లేదంటే మరో ‘స్వర్ణ ప్యాలెస్’ ఘటన పునరావృతమయ్యేది.

వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా..ఆ ఆఫీసు పక్కనే ఉండడంతో వారు వచ్చి వేగంగా మంటలను ఆర్పివేశారు. మంటలు వ్యాపించకుండా అదుపులోకి వచ్చాయి.

అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎస్పీ ఎసుబాబు ఇద్దరూ పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపు చేశారు. కోవిడ్ సెంటర్ పక్కనే అగ్ని ప్రమాదం జరగడం.. రోగులు సేఫ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tags:    

Similar News