బాబర్‌ ఆజామ్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు

Update: 2021-01-15 05:30 GMT
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ప్రస్తుతం నిలకడగా రాణిస్తుంది బాబర్ ఆజమ్ ఒక్కడే. అయితే ఇంతకముందు కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో  మాత్రమే కెప్టెన్ గా ఉన్న బాబర్ ను ఈమధ్యే టెస్టులో కూడా కెప్టెన్ గా నియమించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. అయితే , ఈ బాబర్ అజమ్ పై లైంగిక ఆరోపణల కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా తాజాగా లాహోర్ సెషన్స్ కోర్టు ఆదేశాలతో పోలీసులు అతడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.  

ఈ మద్యే  పాక్ లో బాబర్ పై ఓ మహిళా లైంగిక వేధింపుల కేసు పెట్టింది. నేను బాబర్ స్కూల్ లో కలిసి చదువుకున్నాము అని తెలిపింది. అంతేకాకుండా 10 ఏళ్ళ కిందటే బాబర్ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నాడు. అతనికి నేను మొదట్లో ఆర్థిక సహాయం కూడా చేశాను. కానీ క్రికెటర్ గా గుర్తింపు వచ్చిన తర్వాత నుండి అతని ప్రవర్తన మారిపోయింది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అతను నన్ను ఇంతకముందు గర్భవతిని కూడా చేసాడు. కానీ తర్వాత పెళ్లి గురించి అడిగితే కొట్టడం మాత్రమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని అందుకే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను అని తెలిపింది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ టీం సభ్యులపై కూడా గతంలో లైంగిక ఆరోపణలు చాలానే వచ్చాయి. ఇక, కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Tags:    

Similar News