ధోని వారసుడు పంతా..సంజూ శాంసన్ నా..!
16 ఏళ్ల పాటు భారత్ కు ఆటగాడిగా, కెప్టెన్గా, వికెట్ కీపర్ గా ఎన్నో విజయాలు అందించిన ధోనీ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్సీలో ధోనిని కోహ్లీ మరపిస్తూ విజయాలు అందిస్తున్నాడు. అయితే కీపర్ గా ధోని అంతటి ఆటగాడు భారత్ కు లభించడం ఇక అసాధ్యమేనేమో అనిపిస్తోంది. ధోని మంచి బ్యాట్స్మెన్ గానే కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా నిలిచాడు. కీపింగ్ లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పి తనకెవరూ సాటి లేరని నిరూపించాడు. ఎవరికీ సాధ్యం కాని విధంగా 190 స్టంప్ అవుట్లు, 638 క్యాచ్ అవుట్లు చేశాడు. బ్యాట్స్ మెన్ క్రిజ్ లో అర క్షణం పాటు కాలెత్తిన రెప్పపాటులో ధోని వికెట్లను గిరాటేసేవాడు. ధోనీ కీపర్ గా ఉన్నాడంటే బ్యాట్స్ మెన్ చాలా అప్రమత్తంగా ఉండేవారు. అప్పటి క్రికెట్లో కీపర్ అంటే అంతగా బ్యాటింగ్ చేసేవారు కాదు. అడపాదడపా మాత్రమే బ్యాటింగ్ చేసేవారు. నయాన్ మోంగియా వంటి కీపర్ ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ చేస్తేనే ఆహా ఓహో అనేవారు. సంగక్కర, గిల్ క్రిస్ట్ వచ్చిన తర్వాతే.. కీపర్లు కూడా బ్యాటింగ్ చేయగలరు అని నిరూపించారు.
ధోని ఎంట్రీ తర్వాత సంగక్కర, గిల్ క్రిస్ట్, బౌచర్ వంటి అత్యుత్తమ కీపర్లు నెలకొల్పిన రికార్డులను చేరిపేశాడు. వన్డేల్లో 10,000 పైగా పరుగులు చేశాడు. ధోని రిటైర్మెంట్ తో అతడి వారసుడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఆ స్థానాన్ని భర్తీ చేసే వారు ఉన్నారా అనిపిస్తోంది. ప్రస్తుతానికి భారత్ కనిపిస్తున్న రెండే రెండు ఆశా కిరణాలు పంత్, సంజూ శాంసన్. పంత్ ఇప్పటికే పలు టెస్ట్ - వన్డే మ్యాచులకు ఎంపికయ్యాడు. శాంసన్ కొన్ని వన్డేలు - ట్వంటీల్లో ఆడాడు. అయితే వీరు ధోనీలా బ్యాటింగ్ లోనూ - కీపింగ్ లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నారు. పంత్ మంచి నైపుణ్యమున్న ఆటగాడిగా పేరు తెచ్చుకున్నా బ్యాటింగ్లో నిలకడ చూపించడం లేదు. కాసేపు మెరుపులు మెరిపించిడం - ఆ తర్వాత వెంటనే పెవిలియన్ కు క్యూ కట్టడం జరుగుతోంది. అలా చేసే టెస్టుల్లో ఉన్న స్థానం కూడా మళ్ళీ వెటరన్ బ్యాట్స్ మెన్ సాహా కు అప్పగించాడు. పంత్ కీపింగ్ లోనూ మరింత మెరుగు కావాల్సి ఉంది.
శాంసన్ కూడా మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడే. అయితే అతడికి సుదీర్ఘ కాలం అవకాశాలు రాలేదు. ఇటీవల వచ్చినా అతడు వినియోగించుకోలేక పోయాడు. ధోని తర్వాత భారత్ కు కీపర్ గా సేవలు అందించే అవకాశం పంత్ - శాంసన్ కు మాత్రమే కనిపిస్తోంది. వీళ్ళిద్దరిలో ఎవరు నిలకడ సాధిస్తే... వాళ్లే తదుపరి భారత్ వికెట్ కీపర్ గా స్థిర పడిపోయే అవకాశం ఉంది. ఐపీఎల్ లో మాత్రం పంత్ - శాంసన్ మెరుపులు మెరిపిస్తున్నా అంతర్జాతీయ క్రికెట్ కి వచ్చే సరికే చేతులెత్తేస్తున్నారు. వచ్చే ఐపీఎల్ లో వీళ్ళిద్దరి లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.