రెంట్ కి ఫాదర్!

Update: 2020-08-31 23:30 GMT
నాన్న ..మరచిపోలేని ఓ ఎమోషన్. వెలకట్టలేని ప్రేమకి నిదర్శనం. ప్రతి ఒక్కరి లైఫ్ లో మొదటి రియల్ హీరో. అయితే , ఈ రోజుల్లో పిల్లలతో సరదాగా గడిపే సమయం తండ్రులకు ఉంటోందా..అంటే కచ్చితంగా ఉండటం లేదు అనే చెప్పాలి.  ఆఫీసు పనులతో..  వ్యాపార పనులతో తీరిక లేకుండా  చాలామంది గడుపున్నారు. కొందరి విషయాల్లోనైతే వారాంతాల్లో ఓ అరగంట సమయం పిల్లలతో గడిపితే అదే గొప్ప అవుతోంది. అలాంటి  వారికి ఆస్ట్రేలియాలోని బ్లూ హెవెన్‌ ప్రాంతానికి చెందిన జేక్‌ జేమ్స్‌ తండ్రి ప్రేమని అందిస్తామని అంటున్నారు.

వీకెండ్స్ లో పిల్లలను పార్కులకు తీసుకెళ్లి వారితో ఆడిపాడటం.. పిల్లల చేతులు పట్టుకొని కబుర్లు చెప్పుకొంటూ స్కూల్లో దిగబెట్టడం.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి తీసుకురావడం, పాపాయిలైతే రోజంతా ఆడించడం, వంటి పనులతో తండ్రి ఆప్యాయతను పంచుతా అని అంటున్నారు. అయితే ఈ ‘తండ్రి ప్రేమ’ సర్వీసు ఫ్రీ అనుకునేరు‌. ప్రతి గంటకు రూ.300 అద్దెగా చెల్లించాలి. ఆదివారాల్లో సాయంత్రం 4గంటల తర్వాతనైతే 20శాతం అదనం. ఫేస్‌ బుక్‌ లో ‘అద్దె నాన్న’కు సంబంధించిన వివరాలన్నింటినీ జేమ్స్‌ పోస్ట్‌ చేశారు. దీన్ని చాలామంది  స్వాగతించి .. వాడుకుంటున్నారు. అయితే, రోజులో గరిష్ఠంగా మూడు ఈవెంట్ల వరకే జేమ్స్‌ సర్వీసులు ఉంటాయి. పుట్టినరోజు వేడుకలు, ఫ్యామిలీ సెల్ఫీలు, ఫేస్‌బుక్‌ రిలేషన్‌షిప్‌ వంటి వాటికి అదనపు చార్జీలుంటాయనేది జేమ్స్‌ షరతు. తండ్రి సేవల కోసం జేమ్స్‌ ముందుకు రావడంపై ఓ తల్లి ఆసక్తి కనబర్చారు. జేమ్స్‌కు దరఖాస్తు పెట్టుకొని.. ఓ నెల డబ్బులు ముందుగానే చెల్లించారు.
Tags:    

Similar News