అమ్మాయిలకు గాలం.. ఫేక్ విజయ్ దేవరకొండ అరెస్ట్
అర్జున్ రెడ్డితో టాలీవుడ్ ను షేక్ చేసిన విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పిచ్చ ఫేమ్. అమ్మాయిల మదిని దోచిన రౌడీ బాయ్ గా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.
అయితే విజయ్ క్రేజ్ ను కొందరు నెటిజన్లు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు గాలం వేసి మోసం చేస్తూ ఆ నెపాన్ని విజయ్ మీద నెట్టేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ తో అతడిని పట్టుకున్నారు.
నిజామాబాద్ జిల్లా మీర్జాపూర్ గ్రామానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు యువతులను ట్రాప్ చేసేందుకు యత్నించాడు. ఇందుకోసం విజయ్ దేవరకొండ పేరుతో యూట్యూబ్ లో ఓ చానెల్ ప్రారంభించాడు. అందులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. ఇది హీరో విజయ్ నంబరే అని పొరపడ్డ యువతులు ఆ నంబర్ కు వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున మెసేజ్ లు పంపారు.
దీన్ని సదావకాశంగా మలుచుకున్న యువకుడు సాయికృష్ణ చాటింగ్ చేస్తూ వారిని డైరెక్ట్ గా కలుద్దామని చెబుతూ బిల్డప్ ఇచ్చాడు. ఇలా చాలా మంది యువతులను ట్రాప్ చేశాడు. ఈ విషయం విజయ్ దేవరకొండకు తెలిసింది.
దీంతో విజయ్ తన మేనేజర్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. విజయ్ అసిస్టెంట్ గోవింద్ తో అమ్మాయిలా సాయికృష్ణతో చాటింగ్ చేయించారు. అమ్మాయితో సాయికృష్ణతో మాట్లాడించారు.
ఆ తర్వాత తాను హైదరాబాద్ వస్తున్నానని.. డేటింగ్ చేసి పెళ్లి చేసుకుందామని విజయ్ అసిస్టెంట్ గోవింద్ కు మెసేజ్ పెట్టాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దిగగానే పోలీసులే క్యాబ్ తీసుకొచ్చి సాయికృష్ణను సైబర్ క్రైమ్ స్టేషన్ కు పట్టుకెళ్లారు. సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. తనకు తండ్రి లేడని.. తల్లి దివ్యాంగురాలని తెలుపడంతో ఆయన ఊరి పెద్దలను రప్పించి వారికి అప్పగించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.