• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫేస్‌ బుక్‌ సీఈఓగా...

ఫేస్‌ బుక్‌ సీఈఓగా జుక‌ర్‌ ను తొల‌గించండి!!

By - Tupaki Desk
Update: 2017-02-10 09:04 GMT
ఫేస్‌ బుక్‌ తో ప్ర‌పంచంలోని ఎక్క‌డెక్క‌డి వారినో ఒక్క వేదిక‌పైకి తీసుకు వ‌చ్చిన ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్ వ్య‌వస్థాపకుడు - సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్ కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న కంపెనీ షేర్‌ హోల్డర్లు కొత్త డిమాండ్‌ తెరపైకి తెచ్చారు. జుక‌ర్ బ‌ర్గ్ ను సీఈఓ స్థానంలో తొలగించాలని పట్టుబడుతున్నారు. జుకర్‌ బర్గ్‌ ను తొలగించి ఆయన స్థానంలో కొత్త సీఈవోని నియమించాలని 3,33,000 మంది పిటిషన్‌ వేసినట్టు వెంచర్‌ బీట్‌ పేర్కొంది. నకిలీ సమాచారానికి ఫేస్‌బుక్‌ వేదికగా మారుతోందని, ఇది ఫేస్‌ బుక్ విశ్వ‌స‌నీయ‌త‌కు దెబ్బ అని వారు వాదిస్తూ ఈ కొత్త డిమాండ్ తెచ్చారు.

కాగా ఈ పిటిషన్‌ ఫేస్‌ బుక్‌ పై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలుస్తోంది విశ్లేష‌కులు అంటున్నారు. ఫేస్  బుక్ లో ఎక్కువ వాటాలు జుకర్‌బర్గ్‌కే ఉన్నాయని, ఆయ‌న్ను తొల‌గించాలంటూ పిటిషన్‌ వేసిన షేర్‌ హోల్డర్ల సంఖ్య కేవలం 1500 మాత్రమేన‌ని చెప్తున్నారు. త‌ద్వారా జూకర్‌ బర్గ్ ప‌ద‌వీ మార్పుపై ఈ పిటిషన్‌ ప్రభావం చూపించబోదనేది నిపుణుల అభిప్రాయం. కాగా 2012 నుంచి ఫేస్‌ బుక్‌ కు సీఈవో మరియు బోర్డ్‌ ఛైర్మన్‌ బాధ్యతలు  జుకర్‌ బర్గ్ నిర్వహిస్తున్నారు.  ప్ర‌ముఖ ప‌త్రిక‌ ఫోర్బ్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో తొలి 10 మందిలో జుక‌ర్  బ‌ర్గ్ గ‌త ఏడాది ప‌దో స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించిన ఫేస్‌ బుక్ ద్వారా సంపాదించిన పాపులారిటీతో రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఐటీ కంపెనీలకు స్వ‌ర్గ‌దామ‌మైన సిలికాన్ వ్యాలీ నుంచి త‌న ప్ర‌యాణాన్ని మొద‌లుపెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే  1,500 గృహ స‌ముదాయాల‌కు జుక‌ర్ బ‌ర్గ్ శ్రీ‌కారం చుట్టారని, ఈ ఇళ్ల‌లో 10-15% ఇళ్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి చెందేలా జుక‌ర్‌ బ‌ర్గ్ ప్ర‌ణాళిక‌లు రచించారని వార్త‌లు వ‌చ్చాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Facebook shareholders 
  • Mark Zuckerberg 
  • CEO 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS