పేస్ మాస్క్ ఖరీదు రూ.11.2 కోట్లు ... ప్రత్యేకతలివే !

Update: 2020-11-17 23:30 GMT
కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీనికి తోడు అమెరికా , యూకే వంటి కొన్ని దేశాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రారంభమై , అక్కడి ప్రజలని వణికిపోయేలా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఐదు కోట్ల మందికి పైగా కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే , ఇప్పటికి కూడా కరోనా ను అరికట్టే సరైన వ్యాక్సిన్ ఇంకా తయారుచేయలేకపోతున్నారు. కొన్ని చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే . కరోనా మానవ జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం అందరి జీవితాల్లో పేస్ మాస్కులు , శానిటైజర్లు భాగమైపోయాయి.

దీనితో కొందరు పేస్ మాస్కుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కరోనా సోకకుండా పెట్టుకునే పేస్ మాస్కుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా  బంగారం, వజ్రాలతో ఇజ్రాయేల్ జ్యువెలరీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పేస్ మాస్క్‌ ను తయారు చేసింది. దీని ధర 1.5 మిలియన్ డాలర్లు కాగా.. మన కరెన్సీలో   రూ.11.2కోట్లు. మొత్తం 18 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన ఈ మాస్క్‌ పై 3600 తెలుపు, నలుపు రంగు వజ్రాలను పొదిగారు. ఎన్-99 ఫిల్టర్లను అమర్చారు. వైవెల్ జ్యువెలనీ కంపెనీ ఈ మాస్క్ ‌ను రూపొందించింది. అమెరికాలో నివాసం ఉండే చైనా వ్యాపారవేత్త ఈ మాస్క్‌ ను ఆర్డర్ చేసినట్టు తెలిపారు.  

మొత్తం 270 గ్రాములండే ఈ మాస్క్ సాధారణ సర్జికల్ మాస్క్ కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. దాదాపు నాలుగు నెలలు తీవ్రంగా శ్రమించి ఈ మాస్క్‌ను తయారు చేశారు. ఆగస్టులో ఈ మాస్క్ వివరాల గురించి సదరు సంస్థ యజమాని వెల్లడించారు. జెరూసలేం సమీపంలోని నగల తయారీ సంస్థ యజమాని లెవీ మాట్లాడుతూ.. డబ్బులుంటే ప్రతిదీ కొనుక్కోలేం.. కానీ, చాలా ఖరీదైన  మాస్క్ కొనుగోలు చేసి ధరించడంలో సంతోషం ఉందని, దీని వల్ల చుట్టుపక్కలవారి దృష్టిని ఆకర్షించవచ్చనేది తమ కస్టమర్ ఉద్దేశమై ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇటువంటి ఖరీదైన మాస్క్ తప్పుడు సంకేతాలు పంపుతుంది.. కానీ, ఈ మాస్క్‌ను ధరించనప్పటికీ, మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లెవీ అన్నారు.  మొత్తం 25 మంది నిపుణులైన పనివాళ్లు ఈ మాస్క్ తయారీకి నాలుగు నెలల పాటు తీవ్రంగా కష్టపడ్డారు.  
Tags:    

Similar News