శాసించే స్థాయి ఎదుగుతామంటున్న పవన్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో జనసేనకు అనూహ్య ఫలితాలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లో ఉత్సాహం నింపుతున్నాయి. అలాంటి గ్రామాల్లో పంచాయతీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని పవన్ ఆకాంక్షించారు.యువత, ఆడపడుచుల వల్లే జనసేనకు విజయం దక్కిందని.. గ్రామాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలంటే జనసేనతోనే సాధ్యమని పవన్ అన్నారు.
మూడు విడతల్లో 23శాతం ఓటింగ్ జనసేన సొంతమైందని పవన్ అన్నారు. 270కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేనకు దక్కాయని.. 1654 పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు రెండో స్థానంలో నిలబడ్డారని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జనసేన గెలుపు మార్పునకు సంకేతం అని పవన్ అన్నారు.
మొత్తం పంచాయతీని జనసేన క్లీన్ స్వీప్ చేయడం విప్లవానికి సంకేతం అని పవన్ ఆనందం వ్యక్తం చేశారు. తమ పార్టీకి ఓట్లు వేయకపోయినా ప్రభుత్వ పథకాలన్నీ తీసేస్తామని నేరుగా బెదిరించారు. అయినా ప్రజలందరూ కలసి జనసేన మద్దతుదార్లను గెలిపించారు.ప్రజలకు మంచి చేయాలన్న తపనే తమను గెలిపించిందని పవన్ అన్నారు. గెలిచిన వారంతా ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఉన్నారని.. అందుకే గెలిచారని పవన్ అన్నారు.