గ్లోబల్ విలేజ్‌లో ఆసియా పవర్.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇక్కడి నుంచే!
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ ఎప్పుడో చెప్పాడు. దేశాలు ఎదగాలన్నా.. మనుషులు ఉండాలి (శ్రామిక శక్తి).. అలాగే దేశాలు నాశనం అయ్యేది కూడా (అధిక జనాభా) మనుషులతోనే.;
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ ఎప్పుడో చెప్పాడు. దేశాలు ఎదగాలన్నా.. మనుషులు ఉండాలి (శ్రామిక శక్తి).. అలాగే దేశాలు నాశనం అయ్యేది కూడా (అధిక జనాభా) మనుషులతోనే. అదే విధంగా ప్రపంచంలోని జనాభాను అందిస్తున్న దేశాలలో ఏఏ దేశాలు ఎలా ఉన్నాయో ఎక్స్ లో వరల్డ్ ఇన్ సైట్స్ ఒక పోస్ట్ చేసింది. ప్రపంచ జనాభాను ఒక చిన్న గ్రామంగా లేదంటే 1,000 మంది వ్యక్తులు ఉండే ఒక సమూహంగా ఊహిస్తే, అది మన భూగోళంపై ఉన్న సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను ఎంతో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ గణాంకాలు ప్రపంచం ఏ దిశగా పయనిస్తుందో మనకు తెలియజేస్తున్నాయి.
ప్రపంచం ఒక వెయ్యి మంది గ్రామమైతే..
నేడు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోయింది. ఇంత పెద్ద సంఖ్యను ఊహించుకోవడం కష్టం కాబట్టి, ప్రపంచాన్ని కేవలం 1,000 మంది నివసించే ఒక చిన్న పరిధిలోకి కుదిస్తే కనిపించే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
1. ఆసియా ఆధిపత్యం: భారత్, చైనా
ఈ వెయ్యి మందిలో దాదాపు 355 మంది కేవలం రెండు దేశాల నుంచే వస్తున్నారు.
భారత్ (178).. భారత్ ను 1000 మంది ఉన్న గ్రామంగా ఊహిస్తే అతిపెద్ద సమూహం భారతీయులదే. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలుస్తోంది.
చైనా (177): భారత్‌కు అతి సమీపంలో రెండో స్థానంలో చైనా ఉంది. అంటే, ఈ గ్రామంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు లేదా చైనీయుడు అయి ఉంటారు.
ప్రాంతీయ విభజన
అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా నుంచి కేవలం 42 మంది మాత్రమే ఈ గ్రామంలో ఉంటారు. ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా (35), పాకిస్థాన్ (30), బంగ్లాదేశ్ (22) ల వాటా గణనీయంగానే ఉంది.
ఆఫ్రికా ఖండం పెరుగుదల
గణాంకాలను గమనిస్తే ఆఫ్రికా దేశాల ప్రాతినిధ్యం పెరుగుతోంది. నైజీరియా (28), ఇథియోపియా (16), కాంగో (13) వంటి దేశాలు భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. రాబోయే దశాబ్దాల్లో ఈ ‘వెయ్యి మంది గ్రామం’లో ఆఫ్రికా వాటా మరింత పెరగనుంది.
యూరప్, అభివృద్ధి చెందిన దేశాలు
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఐరోపా దేశాల సంఖ్య ఇప్పుడు చాలా పరిమితంగా ఉంది.
జర్మనీ: 10
నైటెడ్ కింగ్‌డమ్: 8
ఫ్రాన్స్: 8
ఇటలీ: 7
జపాన్ వంటి దేశాల్లో (15 మంది) జనాభా తగ్గుదల కనిపిస్తోంది, ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అంశం.
ఈ 1,000 మందిలో 178 మంది భారతీయులు ఉన్నారంటే, ప్రపంచ వనరులలో, ఉపాధిలో, నిర్ణయాధికారాల్లో భారత్ పోషించాల్సిన పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. జనాభా పెరగడం అనేది ఒక వైపు సవాలుగా ఉన్నప్పటికీ, యువశక్తిని సరిగ్గా వినియోగించుకుంటే అది ప్రపంచ ప్రగతికి చోదక శక్తిగా మారుతుంది. ఈ గణాంకాలు మనకు కేవలం సంఖ్యలను మాత్రమే కాదు, దేశాల మధ్య ఉన్న అసమానతలను, భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే ఆహార, ఆరోగ్య సవాళ్లను కూడా గుర్తు చేస్తున్నాయి.