వివాదాలతో సావాసం చేయడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటే. నిత్యం తన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం విచారణ తీరుపై వర్మ ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను బాహుబలితో పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వర్మ విపరీత వ్యాఖ్యలపై ఎక్సైజ్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలను తాము సహించబోమని ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ అధికారి ఒకరు తేల్చిచెప్పారు. కేసు విచారణలో ఉన్న సమయంలో వర్మ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. రామ్ గోపాల్ వర్మపై కొన్ని సెక్షన్ల కిందకేసు వేస్తామన్నారు. అంతే కాకుండా, కేసును విచారణ చేస్తోన్న ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పై వర్మ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
గతంలోనూ, ఇటువంటి ఎన్నో కేసులను ఎక్సైజ్ శాఖ విచారించిందన్నారు. అప్పట్లో న్యూస్ చానెళ్లు - వెబ్ సైట్లు ఎక్కువ లేవు కాబట్టి ప్రచారం జరగలేదన్నారు. అప్పట్లో కేవలం పేపర్లో మాత్రమే సినీ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారంపై కథనాలు వచ్చేవని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతీ చిన్న విషయం మీడియాలో ప్రసారమవుతోందని, అందువల్ల సినీ ప్రముఖుల వ్యవహారం ప్రజలకు వెంటనే తెలిసిపోతోందని అన్నారు.
వర్మ వ్యాఖ్యలు కేసు విచారణకు ఆటంకం కలిగించేలా ఉన్నాయన్నారు. అకున్ సబర్వాల్ ని బాహుబలితో పోల్చుతూ వర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. బాధ్యత గల ఓ ప్రభుత్వాధికారిపై సినిమాలు తీయమని సలహాలివ్వడం ఏమిటని మండిపడ్డారు. ఓ డీఐజీ స్థాయి అధికారిని వర్మ కించపరుస్తున్నారన్నారు. వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆయన అరెస్టు కావడం ఖాయం అని స్పష్టంచేశారు.