ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఇది చదవటం మిస్ కావొద్దు

Update: 2020-10-25 06:10 GMT
మీరు ఉద్యోగం చేస్తుంటారా? అయితే.. ఇది మీ కోసమే. ఉద్యోగం.. వ్యాపారం చేసే వారంతా ప్రతి ఏటా తమ ఆదాయాలకు సంబంధించిన వివరాల్ని ఆదాయ పన్ను శాఖ వద్ద రిటర్న్ దాఖలు చేయటం తెలిసిందే. ప్రతి ఏడాది జూన్.. జులై నాటికి అసెస్ మెంట్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రిటర్న్ ను దాఖలు చేసే గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ తరహా గడువును ఒకసారి పొడిగించారు. తాజాగా రెండోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా పొడిగింపు ప్రకారం డిసెంబరు 31 లోపు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఇది నవంబరు 30 వరకు మాత్రమే ఉండేది.

ఆదాయపన్ను చట్టం కింద దాఖలు చేయాల్సిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు.. అంతర్జాతీయ.. దేశీయ లావాదేవాలకుసంబంధించిన ఆడిట్ రిపోర్టుల దాఖలు గడువును ఈ ఏడాది చివరకు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులు సైతం రిటర్ను దాఖలు చేసే గడువును డిసెంబరు 31 తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ట్యాక్స్ దారులకు రిటర్ను దాఖలకు సంబంధించి టెన్షన్ తీరినట్లే.
Tags:    

Similar News