ఏపీ బడ్జెట్ లో వీబీ జీ రామ్ జీ భారం ఎంతంటే ?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన వీబీ జీ రామ్ జీ పధకం వల్ల రాష్ట్రాల మీద భాగం ఆర్ధికంగా పడుతోంది.;

Update: 2026-02-14 22:30 GMT

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకుని వచ్చిన వీబీ జీ రామ్ జీ పధకం వల్ల రాష్ట్రాల మీద భాగం ఆర్ధికంగా పడుతోంది. గతంలో మహాత్మా జాతీయ ఉపాధి హామీ పధకంగా ఉంది. దానిని వీబీ జీ రామ్ జీ గా మార్చి సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రాష్ట్రాలు నలభై శాతం వాటాను ఈ పధకం కోసం వెచ్చించాల్సి వస్తోంది. అది 2026-27 నుంచి అమలు అవుతోంది. దాంతో ఈసారి ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వీబీ జీ రామ్ జీ కి నిధుల కేటాయింపు అన్నది స్పష్టంగా చూపించారు.

ఎక్కువ మొత్తంగానే :

ఇక 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక కార్యక్రమాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. వాటిని బట్టి చూస్తే దేశంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేస్తున్న వీబీ జీ రామ్ జీ పధకం విషయంలో ఏపీ బాగానే కేటాయింపులు చేసింది. కేంద్రమే ఈ భారం మోయాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ నలభై సాతం భారం అయితే రాష్ట్రాలు పంచుకోవాల్సిందే అన్నది వీబీ జీ రామ్ జీ పధకంలో ఉంది. దాంతో వీబీ జీ రామ్ జీ పధకానికి ఏపీ ప్రభుత్వం ఏకంగా 8,365 కోట్ల రూపాయలు కేటాయించింది. గతసారి బడ్జెట్ కి ఈసారి బడ్జెట్ కి చూస్తే ఇది ఏపీకి అదనంగా ఆర్థిక భారమే అని అంటున్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఏపీ ఆర్థికంగా ఇబ్బందులో ఉంది. దాంతో ఇది ఆర్ధికంగా భారమే అని అంటున్నారు.

వీటికి సైతం :

అయితే కేంద్ర ప్రాయోజిక కార్యక్రమాలకు రాష్ట్రాల వాటా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అలా చూస్తే గృహనిర్మాణం విషయంలో పట్టణ గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా చేపట్టడం కోసం 5,451 కోట్ల రూపాయలు కేటాయించారు. అలగే జల జీవన్ మిషన్ కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక రీ ప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం 2,144 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. స్వచ్ఛభారత్ మిషన్ కోసం 1,037 కోట్ల రూపాయలు కేటాయించారు. నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కోసం 955 కోట్లు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పధకం కోసం 838 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటితో రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిక పధకాలు ఊపు అందుకోనున్నాయి. వీటి వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సాధ్యపడుతుంది. అందువల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ గా రాష్ట్రం తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News