మీకొచ్చే ప్రతి కలకూ ఒక లెక్క ఉందట

Update: 2019-10-11 01:30 GMT
నిద్రలో కల రావటం కామన్. ఇలా వచ్చే కలలు కొన్ని గుర్తుండిపోతే.. మరికొన్ని అస్సలు గుర్తే ఉండవు. నిద్రలో వచ్చే కల.. వాస్తవంలో ఏమిటి? అసలు కలలు ఎందుకు వస్తాయి? వచ్చే కలలు చాలావరకూ ఒకేలా ఎందుకు ఉంటాయి? ఒకే విషయాన్ని కల రూపంలో అదే పనిగా చెబుతూ ఉంటుందా? అన్నది ప్రశ్న.

కలలకు సంబంధించి ఆసక్తికర అంశాల్నిచూస్తే.. నిజజీవితంలో ఎదుర్కొనే పరిస్థితులే కలలకు కారణంగా చెబుతున్నారు. కలల్ని వాస్తవ జీవితానికి ముడి వేయొచ్చని.. మనసులో జరిగే మధనానికి ప్రతిరూపంగా కలల్ని చెప్పొచ్చంటున్నారు. కొన్ని కలలు.. వాటిని ఎలా చూడాలన్న విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. అవేమంటే..

% దారి తప్పినట్లుగా.. గదిలో బందీగా ఉన్నట్లు వస్తే.. మీరు నిజ జీవితంలో ఎవరో ఒకరి బలవంతంపై పని చేస్తున్నట్లు అర్థం.

% నిత్యం మీరు ఎక్కువసేపు గడిపే మొబైల్ ఫోన్ తో కాల్ చేస్తే అవతల వారు లిఫ్ట్ చేయకపోవటం.. కంప్యూటర్ మీద పని చేస్తున్నప్పుడు చెడిపోయినట్లు కల వస్తే.. మీకు బాగా నచ్చిన వ్యక్తులు దూరం కావటం.. మీ బంధాని ప్రమాదం వచ్చినట్లేనని చెబుతున్నారు. అలాంటి వారితో కూర్చొని మాట్లాడితే కల మారుతుందని.. రియల్ గానూ పరిస్థితి మారుతుందంటున్నారు.

% చుట్టూ అందరూ ఉంటారు. కానీ.. మనం మాత్రం నగ్నంగా రోడ్ల మీద పరుగులు పెడుతూ ఉంటాం. ఈ కలకు అర్థం.. నిజాన్ని దాచేసి బతుకుతున్నట్లు అర్థం.

%  ఎత్తు నుంచి జారిపడటం.. నీళ్లలోకి మునిగిపోవటం లాంటి కల వస్తే.. మీకు ఎదురైన సమస్యను అధిగమించే ప్రయత్నం కంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం.

% ఆప్తులు.. బంధువులు చనిపోయినట్లుగా కలలు వస్తే నిజ జీవితంలో కొత్త దశను చూడబోతున్నట్లు అర్థమట.

% ఎవరో వెంటపడినట్లు.. దాడి చేస్తున్నట్లు కలలు వస్తుంటే.. రియల్ లైఫ్ లో ఒత్తిడిని భరింలేకపోవటం.. సమస్యలతో సతమతమవుతున్నట్లు.

% ఇల్లు కూలినట్లు.. ఎవరో ధ్వంసం చేసినట్లుగా కలలు వస్తే.. ఇంటికి ఏమీ కాదు కానీ.. విలువైన వస్తువుల పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని అర్థం. మీ విలువైన వస్తువులు ఆపదలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటున్నారు.

% భారీ విపత్తు వచ్చినట్లు కల వస్తే.. మీరు నిస్సహాయస్థితిలో ఉన్నట్లు.. మీ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అర్థం.
Tags:    

Similar News