ఈ బ్యాగ్ ను సంపన్న సెలబ్రిటీలు కూడా కొనలేరు

Update: 2020-11-28 23:30 GMT
ఖరీదైన వస్తువుల్ని అందరూ కొనలేరు. కానీ.. సెలబ్రీలు.. సంపన్నులు.. ప్రముఖులకు ఇలాంటివి పెద్ద విషయం కాదన్నట్లు ఉంటుంది. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా..  ఇప్పుడు చెప్పే బ్యాగ్ ను మాత్రం అలాంటి వారు సైతం కొనటం అంత తేలికైన వ్యవహారం కాదు. మీకు తెలిసిన ఏ సెలబ్రిటీ కూడా ఈ బ్యాగ్ ను కొనే సాహసం చేయరని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. సదరు బ్యాగ్ అంత ఖరీదైనది. ఏంటి? సంపన్న సెలబ్రిటీలు కూడా కొనలేనంత ఖరీదైన బ్యాగ్ ఉంటుందా? ఇంతకీ దాని ధర ఎంతంటారా? అని అవుననే చెప్పాలి. ఈ ఇటాలియన్ బ్యాగ్ ఖరీదు.. అక్షరాల రూ.53 కోట్లు మాత్రమే. జీవితంలో ఇంత భారీ మొత్తాన్ని సంపాదించేటోళ్లు కోటిలో వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉంటారు. అలాంటిది ఇంత ఖరీదైన బ్యాగును కొనేంత సీన్.. మన సెలబ్రిటీలలో ఉండరనే చెప్పాలి.

ఇంతకీ ఈ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఎలిగేటర్ చర్మంతో కూసింత మెరుపుతో.. చూసినంతనే సమ్మోహితుల్ని చేసే ఈ బ్యాగ్ ను బోరిని మిలానేసి అనే కంపెనీ రూపొందించింది. ఖరీదైన వజ్రాలతో పాటు.. 10 తెల్ల బంగారు సీతాకోకచిలుకలు.. నీలమణితో రూపొందించారు. ఈ బ్యాగ్ కు మొత్తం 130 క్యారెట్ల వజ్రాల్ని అలకంరించినట్లుగా చెబుతున్నారు. సంపన్నులైన సెలబ్రిటీలు సైతం ఇంత ఖరీదైన బ్యాగ్ ను కొనేందుకు ముందుకు రారు. అలాంటి ఈ బ్యాగ్ ను ఒక లుక్ వేస్తే పోలా? 
Tags:    

Similar News