పాకిస్తాన్ విమానాలకు ఈయూలో నిషేధం

Update: 2020-07-01 07:30 GMT
పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పింది యూరోపియన్ యూనియన్(ఈయూ). పాకిస్తాన్ అంతర్జాతీయ విమానాలను ఆరు నెలల పాటు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా ఈయూ ఏవియేషన్ సేఫ్టీ నిషేధించింది.

దీనికి కారణంగా పాకిస్తాన్ పైలెట్లు ఫేక్ లైసెన్స్ లతో విమానాలు నడుపుతున్నారని వార్తలు రావడమే. దీంతో మూడో వంతు మంది పైలట్లను పాక్ ఎయిర్ లైన్స్ సస్పెండ్ చేసింది.ఇతర పైలెట్ల అర్హత ప్రమాణాలు కూడా చెక్ చేస్తోంది.

తాజాగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ని, చిన్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ని కూడా సస్పెండ్ చేస్తున్నామని ఈయూ ప్రకటించింది.

పాకిస్తాన్ పైలట్ల లైసెన్సుల్లో చాలా వరకు నకిలీవని పాకిస్తాన్ పౌరవిమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ ఇటీవల పార్లమెంట్ లో తెలిపారు. గత నెలలో పైలట్ తప్పిదం వల్లే కరాచీలో విమానం కూలీ 98మంది మరణించడంతో విచారణ చేయగా.. 860 పాకిస్తాన్ పైలట్లలో 262మంది లైసెన్స్ లు నకిలీవని తేలిందని వెల్లడించారు.

దీంతో యూరప్ దేశాలకు విమానాలు నడుపుతున్న పాకిస్తాన్ ఎయిర్ లెన్స్ విమానాలను ఈయూ ఆరు నెలల పాటు నిషేధించింది.
Tags:    

Similar News