మయామి రియల్ ఎస్టేట్ షేక్.. రికార్డు ధరతో విలాసవంతమైన విల్లా కొన్న జుకర్‌బర్గ్!

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అంటే తెలియని వారు వుండరు. ఆయన చేసే ప్రతిది ఓ సంచలనం. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉండే ఈయన, తాజాగా మయామిలో కొన్న ఓ ఖరీదైన ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.;

Update: 2026-03-03 06:51 GMT

మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అంటే తెలియని వారు వుండరు. ఆయన చేసే ప్రతిది ఓ సంచలనం. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌లో ఉండే ఈయన, తాజాగా మయామిలో కొన్న ఓ ఖరీదైన ఇల్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుమారు 170 మిలియన్ డాలర్ల అంటే దాదాపు 1400 కోట్ల రూపాయలకు పై మాటే,ఈ భారీ ధరతో కొన్న ఈ భవనం సరికొత్త రికార్డులను సృష్టించింది. బిలియనీర్ల బంకర్ అని పిలిచే ఒక ప్రైవేట్ ద్వీపంలో ఉన్న ఈ లగ్జరీ హౌస్ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం..

జుకర్‌బర్గ్ కొత్త చిరునామా:

మార్క్ జుకర్‌బర్గ్, తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి మయామిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇండియన్ క్రీక్ ఐలాండ్'లో ఒక భారీ భవనాన్ని తన సొంతం చేసుకున్నారు. ఇక 170 మిలియన్ డాలర్లతో జరిగిన ఈ డీల్, మయామి చరిత్రలోనే అత్యంత ఖరీదైన అమ్మకంగా రికార్డు సృష్టించింది. ఇక అంతకుముందు 120 మిలియన్ డాలర్లుగా ఉన్న రికార్డును జుకర్‌బర్గ్ ఒక్కసారిగా చెరిపివేశారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆరోన్ రోలిన్స్ నుండి ఈ ఎస్టేట్‌ను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణం సగం పూర్తయింది, దీనిని జుకర్‌బర్గ్ తన అభిరుచికి తగ్గట్టుగా మరింత విలాసవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం లో వున్నారు.

బిలియనీర్ల బంకర్.. ఇక్కడ అంతా స్పెషలే:

ఈ ఇల్లు ఉన్న 'ఇండియన్ క్రీక్ ఐలాండ్' సామాన్యమైన ప్రదేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. పరిమితమైన రోడ్లు, ప్రైవేట్ గోల్ఫ్ కోర్ట్, కంట్రీ క్లబ్ వంటి సౌకర్యాలతో పాటు భారీ భద్రత ఈ ఐలాండ్ సొంతం. ఇప్పటికే ఇక్కడ ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, టామ్ బ్రాడీ వంటి దిగ్గజాలు నివసిస్తున్నారు. కాలిఫోర్నియాలో బిలియనీర్లపై పన్నులు పెంచే అవకాశం వున్నందున జుకర్‌బర్గ్ వంటి టెక్ మొగుల్స్ ఇప్పుడు ట్యాక్స్ తక్కువగా ఉండే ఫ్లోరిడా వైపు చూస్తున్నారు. అందుకే మయామి రియల్ ఎస్టేట్ ఇప్పుడు బిలియనీర్ల అడ్డాగా మారిపోయింది.

టెక్ దిగ్గజాల చూపు ఇటు వైపే:

జుకర్‌బర్గ్ ఒక్కరే కాదు, ఇంకా ఎందరో ఈ జాబితాలో వున్నారు వారిలో గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కూడా మయామిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. లారీ పేజ్ ఇప్పటికే 188 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి మూడు ప్రాపర్టీలు కొనగా, సెర్గీ బ్రిన్ కూడా 50 మిలియన్ డాలర్ల ఇంటిని తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే, జుకర్‌బర్గ్ ఈ మయామి భవనాన్ని తన ప్రధాన నివాసంగా వాడుతారా లేక తన రియల్ ఎస్టేట్ కోసం మరో ఆస్తిగా ఉంచుతారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఆయనకుఅనేక చోట్ల పాలో ఆల్టో, లేక్ తాహో, వాషింగ్టన్ డిసి, హవాయిలో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

Tags:    

Similar News