ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఎక్కడుందో తెలుసా?
ఒక ఇంటి విలువ వేల కోట్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించగలరా? విలాసవంతమైన భవనాలు, రాజభవనాల రూపురేఖలు వింటేనే ఎవరికైనా తీవ్రమైన కుతూహలం కలుగుతుంది.
ఒక ఇంటి విలువ వేల కోట్లు ఉంటే ఎలా ఉంటుందో ఊహించగలరా? విలాసవంతమైన భవనాలు, రాజభవనాల రూపురేఖలు వింటేనే ఎవరికైనా తీవ్రమైన కుతూహలం కలుగుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో లగ్జరీ హోమ్స్, మోడర్న్ మాన్షన్స్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఆసక్తికి తగ్గట్టే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా నిలిచిన 'ది వన్' భవనం విశేషాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి..
లాస్ ఏంజిల్స్‌లో ఒక కలల ప్రసాదం:
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఉన్న బెల్ ఎయిర్ ప్రాంతంలో ఈ విలాసవంతమైన భవనం నిర్మితమైంది. నైల్ నియామి నిర్మించిన 'ది వన్' అనే ఈ మెగా మాన్షన్ విస్తీర్ణం సుమారు 1,05,000 చదరపు అడుగులు! ప్రపంచంలోనే అత్యంత పెద్ద, ఆధునిక ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఇక ప్రారంభంలో దీని అంచనా విలువ ఏకంగా 500 మిలియన్ డాలర్లు మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.4,000 కోట్లు కావడం విశేషం.
అద్భుతమైన వసతులు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు:
ఈ రాజభవనంలో ఉన్న సౌకర్యాలు వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో 21 విశాలమైన బెడ్‌రూమ్‌లు, ఏకంగా 42 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఇక వీటితో పాటు 5 స్విమ్మింగ్ పూల్స్, ఒక ప్రైవేట్ నైట్‌క్లబ్, 50 కార్లు నిలిపేందుకు వీలుగా ఉండే గ్యారేజ్, బౌలింగ్ అల్లే, మరియు ఒక ప్రైవేట్ సినిమా థియేటర్ కూడా ఉండటం విశేషం. ప్రతీ గదికి ఒక ప్రత్యేకమైన పేరు ఉండటం దీని డిజైన్ శైలికి నిదర్శనం.
వేలం పాటలో అమ్ముడైన వైనం:
అయితే, నిర్మాణదారుడికి ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా ఈ భవనం దివాలా వేలానికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనుకున్న భారీ ధర కాకుండా వేలంలో 141 మిలియన్ డాలర్లకు ఈ భవనాన్ని దక్కించుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.1362 కోట్లు.. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు, కొనుగోలు ఒప్పందాల ఆధారంగా ఇలాంటి ఆస్తుల విలువ మారినప్పటికీ, దీని వెనుక ఉన్న డిజైన్, నిర్మాణ శైలి, ప్రత్యేకతలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చెక్కుచెదరని గుర్తింపు తెచ్చిపెట్టాయి.
లగ్జరీ హౌస్‌లపై సోషల్ మీడియా క్రేజ్:
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లగ్జరీ హోమ్ టూర్లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇక సాధారణ ఇళ్ల నుంచి కోటీశ్వరుల భవనాల వరకు ఎలాంటి లైఫ్‌స్టైల్ ఉందో తెలుసుకోవడానికి జనాలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అందుకే 'ది వన్' లాంటి మెగా మాన్షన్స్ గురించి వస్తున్న వీడియోలు, ఆర్టికల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతున్నాయి.
కలల నివాసాల విజువల్ వండర్:
విలాసవంతమైన నిర్మాణాలు కేవలం పెట్టే ఖర్చుకే కాకుండా, వాటి డిజైన్, విస్తీర్ణం, అధునాతన సౌకర్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక విజువల్ వండర్‌గా నిలిచిపోతాయి. ఇక వేల కోట్ల విలువైన 'ది వన్' భవనం కూడా మోడర్న్ ఆర్కిటెక్చర్‌కు ఒక మచ్చుతునకగా నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని విలాసవంతమైన భవనాలు వచ్చినా, 'ది వన్' సృష్టించిన టాక్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం.