కోహ్లీకి అంపైర్లు అంటే లెక్కలేదు..!
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అద్భుతంగా ప్రదర్శన ఇస్తాడో.. అంతే ఈజీగా వివాదాల్లోనూ ఇరుక్కుంటూ ఉంటాడు. మైదానంలో అతడి ప్రవర్తన తరచూ వివాదాస్పదం అవుతూ ఉంటుంది. అటు ఐపీఎల్లోనూ.. ఇటు అంతర్జాతీయ ఆటల్లోనూ కోహ్లీ నిత్యం వివాదాలను ఎదుర్కొంటూ ఉంటాడు. వివిధ దేశాల సీనియర్ ఆటగాళ్లు సైతం కోహ్లీ తీరును విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంపైర్లంటే కనీసం గౌరవం లేదని విమర్శించాడు. ఇటీవల కోహ్లీ పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లతో, అంపైర్లతో గొడవకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేవిడ్ లాయిడ్ స్పందించాడు. కోహ్లీకి కొన్ని చురకలు అంటించాడు.
కోహ్లీ తన తీరును మార్చుకోవాలని కోరాడు. అంపైర్లపై గౌరవం పెంపొందించుకోవాలని సూచించాడు. నాలుగో టీ20లో భాగంగా 'సాఫ్ట్ సిగ్నల్' కాల్ తో సూర్యకుమార్ యాదవ్ ఔటైన తీరుపై కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ క్రికెటర్లు అంపైర్లపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాక కోహ్లీ.. ఇటీవల బట్లర్ తోనూ గొడవపడ్డాడు. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డేవిడ్ లాయిడ్ స్పందించాడు. ఈ సందర్భంగా యూకే డెయిలీకి ఓ మెయిల్ రాశాడు.
' అంపైర్లపై కోహ్లీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో నాకు తెలియదు. కానీ కోహ్లీ మాత్రం అంపైర్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. అంపైర్లంటే లెక్కలేకుండా వ్యవహరిస్తున్నాడు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఈ విషయంపై ఐసీసీ కూడా ఏమీ చేయలేకపోతున్నది. ఇది మరింత బాధాకరం.' అంటూ డేవిడ్ లాయిడ్ అన్నాడు. అయితే కోహ్లీపై వివాదాలు రావడం ఇది తొలిసారి కాదు. ఇంటర్నేషనల్ క్రికెట్లో, ఐపీఎల్లో అతడిపై తరచూ విమర్శలు వస్తుంటాయి.