ఎన్ ఫీల్డ్ క్రేజ్ లో ఈ కోణం తెలుసా?

Update: 2016-04-02 06:47 GMT
మనలో మన మాటగా చెప్పాలంటూ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ అన్న వెంటనే.. భారీగా ఉండే ద్విచక్రవాహనం కనిపిస్తుంది. ఈ బండిని నడపాలంటే అయితే భారీకాయం ఉండాలే కానీ.. స్మూత్ గా.. సింఫుల్ గా ఉండే కుర్రాళ్లకు ఈ బైక్ సూట్ కాదనే పేరుంది. కానీ.. గత కొద్ది నెలలుగా ఈ బైక్ మీద క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్క మార్చి నెలలోనే ఈ బైకులు ఏకంగా 51,320 అమ్మినట్లుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సంపన్నుల బైక్ గా పేరున్న రాయల్ బైక్ ఇప్పుడు అందుకు భిన్నంగా కుర్రకారు మొదలు మధ్యవయస్కులు కూడా భారీగా వినియోగించటం కనిపిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల మొదలు.. పట్టణ.. నగరాల్లోనే రాయల్ ఎన్ ఫీల్డ్ జోరు రోజురోజుకి పెరుగుతోంది. ఉన్నట్లుండి ఈ భారీ బైక్ మీద క్రేజ్ ఎందుకు పెరుగుతోంది? అన్న ప్రశ్న వేసుకుంటే.. ఒక కొత్తకోణం కనిపిస్తుంది. ఈ వాహనాన్ని కొనిపించేందుకు కుర్రాళ్ల తల్లిదండ్రులు కూడా మక్కువ ప్రదర్శించటం మరో ఆసక్తికర పరిణామం. ధీనిపై ఈ మధ్యన కొంతమంది మీడియా సభ్యులు ఈ బైకు వినియోగిస్తున్న వారితో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు.. ఈ బైకు మీద మోజు పెరగటానికి కారణాలు బయటకు వచ్చాయి.

స్టైల్ గా ఉండటం.. రాజసం ఉట్టిపడేలా ఉండటంతో పాటు.. ఈ భారీ బైక్ యూత్ ఐకాన్ గా మారటానికి దీనికున్న విలక్షణతను ప్రస్తావిస్తున్నారు. భారీగా ఉన్నప్పటికి గాల్లో తేలిపోయే వేగంతో దూసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉండటం.. స్కిడ్ కావటానికి తక్కువ అవకాశం ఉండటం ఈ బైక్ వినియోగం మీద మక్కువ పెరుగుతున్నట్లుగా తేలింది. అంతేకాదు..ఈ బైక్ ను కొనిపించి ఇవ్వటానికి పేరెంట్స్ మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే.. ఒక మోతాదు దాటిన తర్వాత దీని వేగం పరిమితంగానే ఉంటుంది. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ బైక్ గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగం కంటే తక్కువగా ఉన్నప్పుడు దీని బీట్ ను ఎంజాయ్ చేసే వీలుంది. డ్రైవింగ్ ఎంజాయ్ మెంట్ కూడా పరిమిత వేగంలో మాత్రమే అవకాశం ఉండటంతో.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం లేదు. అందుకే.. రాయల్ ఎన్ ఫీల్డ్ ను తమ పిల్లలకు కొనిపెట్టేందుకు తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశాల్లోని వాస్తవికత ఎంతన్నది మీరూ చెక్ చేసుకోండి.
Tags:    

Similar News