పిల్లలు లేరని చెల్లితో భర్తకి పెళ్లి..ముగ్గురికి ఒకే, కానీ అంతలోనే !

Update: 2021-08-29 00:30 GMT
తన మెడలో మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్న భర్త ను మరో మహిళ కన్నెత్తి చూసినా ఆ భార్య ఒప్పుకోదు. కానీ, భర్తకి పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం ఉండటం, వంశాభివృద్ధి కోసంతో ఓ మహిళ తన భర్త ను మరో మహిళకి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత కూడా ముగ్గురూ కలిసి హాయిగా ఉండేవారు. కానీ, అకస్మాత్తుగా ఒక్కరిగా ఆ ఇద్దరు మహిళలు కూడా కనిపించకుండాపోయి పొలం లో శవమై కనిపించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

ఓ మహిళ గత 25 ఏళ్ల క్రితం యువకుడిని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగి ఎన్నేళ్లైనా పిల్లలు లేరు. దీనితో ఇద్దరిలో కొంత అసహనం ఉండేది. ఆ సమయంలోనే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని ఆ అతడికి చెప్పేవారు. దీనితో ఆ మీ తన చెల్లి నే ఇచ్చి భర్తకు

రెండో వివాహం జరిపించింది. ముగ్గురూ సంతోషంగానే జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం నుంచి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించలేదు. దీనితో కుటుంబ సభ్యులు వారిద్దరి కోసం వెతికారు. మరుసటి రోజు ఉదయం రాధేశ్యామ్ తన పొలం చూడటానికి వెళ్ళినప్పుడు, అక్కాచెల్లెళ్ల మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి.

ఆ తర్వాత, అతను వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించాడు. ఛత్తీస్‌గఢ్‌ లోని జంజ్‌ గిర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గత గురువారం పొలం పనికి వెళ్లిన సంతోషి, అపి మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. తర్వాతి రోజు పొలానికి వెళ్లిన భర్తకు వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వారి మృతదేహాలపై ఎలాంటి గాయాలూ లేవు. వారిద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తమకు ఆస్థిలో రావాల్సిన వాటా గురించి అక్కాచెల్లుళ్లు ఇద్దరూ కొంత కాలంగా తమ సోదరులతో గొడవ పడుతున్నారు. వీరికి వాటా ఇచ్చేందుకు సోదరులిద్దరూ అంగీకరించడం లేదు. దీనితో అక్కాచెల్లెళ్లు కోర్టు కి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోదరులు వారిని పొలంలోని బురదలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.



Tags:    

Similar News