డిసెంబర్ 30న ఎస్బీఐ ఎగవేతదారుల ఆస్తుల ఇ-వేలం

Update: 2020-12-23 06:10 GMT
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వేలానికి రెడీ అయ్యింది. బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఎగవేతదారులు పెట్టిన తనఖా ఆస్తులను డిసెంబర్ 30న ఇ-వేలం వేయనున్నారు.ఈ వేలంలో వాణిజ్య, నివాస ఆస్తులు ఉన్నాయి. ఎగవేతదారుల తనఖా ఆస్తులు, బకాయిలను తిరిగి పొందడానికి బ్యాంకు వీటిని వేలం వేస్తోంది. తమ బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఆ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన వారి ఆస్తులను ఇ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఎస్బీఐ ఇ-వేలంలో 758 నివాస ఆస్తులు.. 251 వాణిజ్య ఆస్తులు, 98 పారిశ్రామిక ఆస్తులు వచ్చే 6 రోజుల్లోనే వేలానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రానున్న 30 రోజుల్లో మరో 3032 నివాస ఆస్తులు.. 844 వాణిజ్య ఆస్తులు.. 410 పారిశ్రామిక ఆస్తులను వేలం వేయనున్నారు.

వేలంలో పాల్గొనాలనుకుంటే ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ లో ఈమెయిల్, మొబైల్ నంబర్, పేరు రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరలకే ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని మీరూ సద్వినియోగం చేసుకోండి. ఆస్తులపై డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం.

ఇక ఆస్తిని వేలంలో కొనే కొనుగోలు దారులు ఆస్తికి సంబంధించిన సమస్యలు ఉంటే బ్యాంకు బాధ్యత వహించదు. వాటిని పరిష్కరించుకునే బాధ్యత కొనుగోలుదారుడిదే..
Tags:    

Similar News