న్యూఇయర్ వేళ.. మెట్రో పిల్లర్ ఢీ కొట్టి ఐటీ ఉద్యోగి దుర్మరణం
కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్న ఉత్సాహం హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగి ప్రాణాల్ని తీసింది. గడిచిన కొద్దిరోజులుగా కొత్త సంవత్సరంవేడుకలపై హైదరాబాద్ మహానగర పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిబంధనల్ని పాటించాలని వారు కోరుకున్నారు. అయినప్పటికీ.. మాట వినని వారెందరో. ఇలాంటివారిలో ఒకరు దుర్మరణం పాలైన ఉదంతం దిల్ సుఖ్ నగర్ లో చోటు చేసుకుంది.
కొత్త సంవత్సరంలోకి కొద్ది క్షణాల్లో అడుగు పెడుతున్న వేళ.. బైక్ మీద వాయు వేగంతో వెళుతున్న రాజు అనే ఐటీ ఉద్యోగి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో పిల్లర్ ను బలంగా ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో కిందకు పడిపోయిన అతడు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు.
అమితమైన వేగం.. బలంగా మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టటంతోనే రాజు మరణించినట్లుగా చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. దీంతో.. అతడి కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. వాయు వేగం రాజు ప్రాణాల్ని తీసింది. ఈ ప్రమాదమే లేకుంటే.. కొత్త సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో.. స్నేహితులతో ఎంతగా ఎంజాయ్ చేసేవాడో కదా?