నరాలు తెగే ఉత్కంఠ..బీజేపీ థ్రిలింగ్ విక్టరీ!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు అంటూ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి తెలంగాణ రాజకీయం మొత్తం ఆ ఒక్క నియోజకవర్గం చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఎలాగైనా దుబ్బాక స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార టిఆర్ ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నాలు చేశాయి. ఎన్నో వ్యూహాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్ ఎస్ నుండి పలువురు మంత్రులు రంగంలోకి దిగి విజయం కోసం పక్కా ప్రణాళికలు రచించారు. అయితే , మొదటి నుండి ఇక్కడ టిఆర్ ఎస్ - బీజేపీ మద్యే యుద్ధం జరుగుతూ వస్తుంది. దీనితో పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కూడా పలు ప్రముఖ ఛానెల్స్ అన్ని కూడా పోటీ కేవలం టిఆర్ ఎస్ - బీజేపీ మధ్య ఉండబోతుంది అని ప్రకటించాయి. కొన్ని దుబ్బాక లో కమలం వికసించబోతుంది అని చెప్తే .. మరికొన్ని దుబ్బాకలో కారు జోరు కొనసాగుతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే , ఈ రోజు ఉదయం నుండి కౌంటింగ్ మొదలైంది .. ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ...
సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల లో లెక్కింపు కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,64,192 మంది ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకున్నారు. టీఆర్ ఎస్ నుంచి సోలిపేట సుజాత - బీజేపీ నుంచి రఘునందన్ రావు - కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో నిలిచారు.
ఫస్ట్ రౌండ్ : మొదటి నుండి దుబ్బాక లో కారు జోరు కొనసాగుతుంది అని అందరూ ఊహించారు కానీ - దుబ్బాక వాసులు టిఆర్ ఎస్ కి షాక్ ఇచ్చారు. తోలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,208 ఓట్లు రాగా - టీఆర్ ఎస్ కు 2,867 - కాంగ్రెస్ కు 648 ఓట్లు పోలయ్యాయి.
రెండో రౌండ్ : ఇక రెండో రౌండ్ లో కూడా బీజేపీ దూకుడు కొనసాగింది. రెండు రౌండ్ల లో 14573 ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 1135 ఓట్ల ఆధిక్యం లభించింది. రఘునందన్ రావుకు 6492 ఓట్లు వచ్చాయి. సోలిపేట సుజాతకు 5357 ఓట్లు లభించాయి. చెరుకు శ్రీనివాసరెడ్డి కి 1315 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్ : ఇక మూడో రౌండ్‌లో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచింది. మూడో రౌండ్ లో బీజేపీకి 2,731 టీఆర్ ఎస్ కి 2,067 ఓట్లు వచ్చాయి. దీంతో మూడో రౌండ్ లో బీజేపీకి 124 ఓట్లు అత్యధికం లభించింది. టీఆర్ ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో కూడా బీజేపీకి 110 ఓట్లు లీడ్ రావడం విశేషం.
నాలుగో రౌండ్ : ఇప్పటివరకు నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తి అయ్యింది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 2,684 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 13,055, - టీఆర్ ఎస్ 10,371 - కాంగ్రెస్ 2,158 ఓట్లతో ఉన్నాయి. బీజేపీ నాలుగో రౌండ్ లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించారు.
ఐదో రౌండ్ : తాజాగా ఐదో రౌండ్ లెక్కింపు పూర్తి అయింది. ఐదో రౌండ్ లోనూ బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ 16,571 - టిఆర్ ఎస్ 13,497 - కాంగ్రెస్ 2724 ఓట్లతో ఉన్నాయి
ఆరో రౌండ్ : దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో ఆరో రౌండ్ లో టిఆర్ ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. అధికార టీఆర్ ఎస్ కు ఆరో రౌండ్ తర్వాత కూడా కొంత ఉపశమనం లభించింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నారు. అయితే , ఆరో రౌండ్ లో టిఆర్ ఎస్ ఆధిక్యం ప్రదర్శించడంతో టిఆర్ ఎస్ హవా మొదలైంది అంటూ టిఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. ఆరో రౌండ్‌లో టీఆర్ ఎస్ 353 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 20,226 - టిఆర్ ఎస్ 17,559 - కాంగ్రెస్ 3254 ఓట్లతో ఉన్నాయి
దుబ్బాక లో మారిన ట్రెండ్ ...ఏడో రౌండ్ లో టీఆర్ ఎస్ కు ఆధిక్యం
ఏడో రౌండ్ : ఏడో రౌండ్ లో టీఆర్ ఎస్ 182 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఏడురౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా బీజేపీ 22,762.. టీఆర్ ఎస్ 20,277.. కాంగ్రెస్ 4,003 ఓట్లు సాధించాయి. ఇప్పటివరకూ.. 52,055 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.తోలి ఐదు రౌండ్లు బీజేపీ హవా కనిపించినప్పటికీ .. ఇప్పుడిప్పుడే టీఆర్ ఎస్ లీడ్ లోకి వస్తుంది. దుబ్బాక ఉపఎన్నికలో మొత్తం 1,64,192 ఓట్లు పోల్ అయ్యాయి.
ఎనిమిదో రౌండ్ పూర్తి ... మారుతున్న లెక్కలు
ఎనిమిదో రౌండ్ : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. తొలి ఐదు రౌండ్లలోనూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మెజార్టీ రావడంతో... అన్ని రౌండ్లు ఇదే రకంగా ఉంటాయేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆరో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యతను కనబరుస్తూ వస్తుంది. తాజాగా ఎనిమిదో రౌండ్ లో మళ్లీ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. ఎనిమిదో రౌండ్ లో బీజేపీ 621 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ 3,106 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రౌండ్ లో బీజేపీ 3,116 టీఆర్ ఎస్ 2,495.. కాంగ్రెస్ 1,122 ఓట్లు సాధించాయి. ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్ 8 రౌండ్లు పూర్తికాగా.. 6 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించాయి.
9 వ రౌండ్ : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలపై కౌటింగ్ జరిగేకొద్ది ఉత్కంఠత పెరిగిపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఇప్పటి వరకూ తొమ్మిది రౌండ్లు పూర్తయ్యాయి. తొమ్మిదో రౌండ్ లో మళ్లీ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. 9 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,190 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 9వ రౌండ్ లో బీజేపీ 3,143.. టీఆర్ ఎస్ 2,329.. కాంగ్రెస్ 675 ఓట్లు సాధించాయి. ఇప్పటివరకు దుబ్బాక కౌంటింగ్ 9 రౌండ్లు పూర్తికాగా.. 7 రౌండ్లలో బీజేపీ, రెండు రౌండ్లలో టీఆర్ ఎస్ ఆధిక్యం సాధించాయి. బీజేపీ 29,291 - టీఆర్ ఎస్ 25,101, - కాంగ్రెస్ 5,800 ఓట్లతో ఉన్నాయి.
10వ రౌండ్: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో .. పదవ రౌండ్‌లో టీఆర్ ఎస్ 456 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,734 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. 10వ రౌండ్ లో బీజేపీ 2,492.. టీఆర్ ఎస్ 2,948.. కాంగ్రెస్ 899 ఓట్లు సాధించాయి. మొత్తంగా ఇప్పటివరకు బీజేపీ 31,783.. టీఆర్‌ఎస్ 28,049.. కాంగ్రెస్ 6,699 ఓట్లు సాధించింది. అలాగే ఇప్పటివరకు మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇంకా 13 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సింది ఉంది.
11 వ రౌండ్ : దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ లో ఆరు, ఏడు రౌండ్లలో వెనుకబడిన బీజేపీ మళ్లీ పుంజుకుంది. వరుసగా ఎనిమిది, తొమ్మిది రౌండ్లలో ఆధిక్యతను సాధించింది. మళ్లీ పదో రౌండ్ లో టిఆర్ ఎస్ ఆధిక్యం కనబరిచినా .. 11వ రౌండ్‌లో బీజేపీ 199 ఓట్ల స్వల్ప ఆధిక్యత సాధించింది. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 3,911 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 11వ రౌండ్‌లో బీజేపీ 2965.. టీఆర్‌ఎస్ 2,766.. కాంగ్రెస్ 1883 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 34,748.. టీఆర్‌ఎస్ 30,815.. కాంగ్రెస్ 8,582 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. దీనితో గెలుపు తమదేనని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ శిబిరం నిరాశలో మునిగిపోయింది.
దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ముందుకు సాగేకొద్దీ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మొదటి నుండి ఆధ్యికంలో కొనసాగుతున్నారు. తాజాగా 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. 12వ రౌండ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్ 83 ఓట్ల ఆధిక్యత సాధించింది. 12 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ 4,030 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 12వ రౌండ్ లో కాంగ్రెస్ కి 2080, బీజేపీ కి 1997, టిఆర్ ఎస్ కి 1900 ఓట్లు వచ్చాయి. ఇంకా 11 రౌండ్ల లెక్కింపు మిగిలుంది. ఇప్పటివరకు బీజేపీ 8 రౌండ్లలో, 3 రౌండ్లలో టిఆర్ ఎస్ , 1 రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్ లో టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్ లో టీఆర్‌ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు దక్కించుకున్నాయి.14వ రౌండ్‌లో 288 ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్ సాధించింది. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు బీజేపీ కి 41,514 ఓట్లు రాగా, టిఆర్ ఎస్ కి 38,076 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కి 12, 658 ఓట్లు వచ్చాయి.
15వ రౌండ్ లో టీఆర్‌ఎస్ మెజారిటీ సాధించింది. 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఈ రౌండ్ లో టీఆర్‌ఎస్ కి 3027, బీజేపీ కి 2072, కాంగ్రెస్ పార్టీ కి 1500 ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్ ముగిసే సరికి 2483 ఓట్ల లీడ్ లో బీజేపీ కొనసాగుతుంది .
టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 16వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి 750 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ కు 3157, బీజేపీకి 2408, కాంగ్రెస్‌కు 674 ఓట్లు దక్కాయి. ఇక 17వ రౌండ్ లో కూడా టీఆర్ ఎస్ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ లో టీఆర్ ఎస్ 800 ఓట్ల మెజారిటీ సాధించింది. 17 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 934 ఓట్లకు తగ్గింది. ఈ రౌండ్ లో టీఆర్ ఎస్ కు 2818, బీజేపీకి 1946, కాంగ్రెస్ కు 1705 ఓట్లు వచ్చాయి.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో మొదట్లో బీజేపీ గాలి విచినప్పటికీ, కౌంటింగ్ జరిగేకొద్దీ అధికార టీఆర్ ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తోంది. 18వ రౌండ్ లోనూ టీఆర్ ఎస్ పార్టీ 688 ఓట్ల మెజారిటీ సాధించింది. 18 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం 172 ఓట్లకు తగ్గిపోయింది. దీనితో ఫలితాలపై ఉత్కంఠత మొదలైంది. క్రమంగా టీఆర్ ఎస్ పుంజుకుంటుండటంతో బీజేపీ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో రానున్న రౌండ్ల కౌంటింగ్ మరింత ఉత్కంఠను పెంచనుంది.
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ ఎస్ అనూహ్యంగా పుంజుకుని బీజేపీపై ఆధిక్యతను సాధించింది. 19వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై టీఆర్ ఎస్ అభ్యర్థి సుజాత లీడింగ్ సాధించింది. 13వ రౌండ్ నుంచి వరుసగా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ లీడ్ సాధిస్తూ వస్తూ , బీజేపీ క్రమంగా ఆధిక్యాన్ని కోల్పోతూ, చివరకు టీఆర్ ఎస్ కంటే వెనుకపడిపోయింది. 19 రౌండ్ లోనూ గులాబి పార్టీ జోరు కొనసాగడంతో 19 వ రౌండు పూర్తయ్యే సరికి టీఆర్ ఎస్ 425 ఓట్ల మెజారిటీ సాధించింది. దీంతో, మొత్తంమీద బీజేపీపై 251 ఓట్ల మెజార్టీని సాధించింది. మరో నాలుగు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉండటంతో... అన్ని పార్టీలు తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి.
దుబ్బాక లో కారు జోరు కొనసాగుతున్న సమయంలో అనూహ్యంగా 20వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వచ్చింది. 100 ఓట్ల ఆధిక్యం సాధించింది. అయితే 20వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ 491 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మరో 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
దుబ్బాక ఉపఎన్నిక ఫలితల సరళి నరాలు తెంచే ఉత్కంఠను రేపుతున్నాయి. 19వ రౌండు ముగిసే సరికి బీజేపీపై టీఆర్ ఎస్ ఆధిక్యతను సాధించిన సంగతి తెలిచసిందే. 20 - 21వ రౌండ్లలో బీజేపీ మళ్లీ ముందుకు వచ్చింది. 21 రౌండులో బీజేపీ 380 ఓట్ల ఆధిక్యత సాధించింది. దీనితో 21వ రౌండు ముగిసే సరిగి బీజేపీ మొత్మంమీద బీజేపీ 620 ఓట్ల మెజార్టీతో నిలిచింది. ఇక కేవలం 2 రౌండ్ల ఫలితాలు మాత్రమే వెలువడాల్సిఉంది. దీనితో అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
22 వ రౌండ్ : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తీవ్ర ఉత్కంఠత ను రేకెత్తిస్తుంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరాగా సాగుతున్న పోరులో కమలమే పైచేయి సాధించినట్లు అర్థమౌతుంది . కాగా 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక, కేవలం మరో ఒక్క రౌండ్ ఫలితం మాత్రమే మిగిలి ఉంది. ఈ రౌండ్ లో 438 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ నిలిచింది. ఇక 22 రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి 1058 ఓట్ల మెజారిటీ తో కొనసాగుతున్నారు. దీనితో 23వ రౌండ్ లోనూ కమలం పార్టీ జోరు కొనసాగితే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం లాంఛనమే అని చెప్పవచ్చు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఓవర్ ను తలపించింది. బాల్ బాల్ కి ఎలా అయితే ట్రెండ్స్ మారుతాయో , దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు టిఆర్ ఎస్ అభ్యర్థి పై స్వల్ప ఓట్ల తేడా తో విజయం సాధించాడు. ఇక కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అయింది. అయితే , చివరి రౌండ్ లో రెండు ఈవీఎం లు పనిచేయకపోవడం తో కౌంటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది అని తెలుస్తుంది. అయితే , బీజేపీ విజయం మాత్రం ఖాయమైంది. మరికాసేపట్లో అఫిషియల్ ప్రకటన వెలువడనుంది. దీంతో కాషాయ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు