ఉడ్తా హైదరాబాద్.. జిమ్స్ కేంద్రంగా స్టెరాయిడ్స్ దందా!
హైదరాబాద్ లో జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లు కేంద్రంగా ఓ నయా డ్రగ్స్ దందా షురువైంది. జిమ్స్, ఫిట్నెస్ కేంద్రాలకు వచ్చే యువతే లక్ష్యంగా కేటుగాళ్లు వాళ్లకు స్టెరాయిడ్ లు అంటగడుతున్నారు. సిక్స్ ప్యాక్ లు, కండలు తిరిగే దేహం కోసం సంవత్సరాల తరబడి కసరత్తుల చేయాల్సిన అవసరం లేదని.. తాము ఇచ్చే సప్లిమెంట్స్ తీసుకుంటే కొన్ని వారాల్లోనే ఆకర్షణీయమైన దేహాన్ని సొంతం చేసుకోవచ్చని వారికి ఆశలు కల్పిస్తున్నారు. ఇలా యువతకు స్టెరాయిడ్లను విక్రయిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
జిమ్స్ కు వెళ్లే యువతే టార్గెట్..
ఆకర్షణీయంగా కనిపించాలని, కండలు తిరిగే దేహం సొంతం చేసుకోవాలని, సిక్స్‌ప్యాక్‌లతో అదరగొట్టాలని యువత కలలు కంటుంటారు. అందులో భాగంగా వారు గంటల తరబడి కసరత్తులు చేస్తారు. అయితే అటువంటి యువతను ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. గంటల తరబడి జిమ్స్‌లో గడపాల్సిన అవసరం లేదని.. కేవలం కొన్ని రోజుల్లోనే మీరు అదిరిపోయే బాడీని సొంతం చేసుకోవచ్చని వారికి ఈ స్టెరాయిడ్స్‌ను అంటగడుతున్నారు. సాధారణంగా అనస్తీషియా డాక్టర్లు.. రక్తపోటును పెంచి గుండె సక్రమంగా పనిచేయడానికి పేషెంట్లకు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్ ప్రభావంతో నరాలు తెరుచుకుంటాయి. బాడీ ఉత్తేజితం అవుతుంది. ప్రస్తుతం ఓ ముఠా యువతకు ఇటువంటి ఇంజెక్షన్లనే అంటగడుతుంది. ఈ మందు వాడితే 5 కిలోల బరువులు కూడా లేపలేని వారు ఓకేసారి 30 కిలోల లేపుతారు. వేగంగా కసరత్తులు చేస్తారు.
ఈ ఇంజెక్షన్ ఒక సారి తీసుకుంటే దీని ప్రభావం దాదాపు 5 నెలల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఒక్కొ ఇంజెక్షన్‌కు ఈ ముఠా రూ.5 వేల నుంచి 30వేలు వసూలు చేస్తున్నది. ఈ ఇంజెక్షన్ తో తక్కువ సమయంలో యువత కోరుకున్న బాడీషేప్ వస్తుండటం తో ఈ ఇంజెక్షన్ కు యువత బానిసలవుతున్నారు. కాగా యువత ఈ స్టెరాయిడ్స్‌కు బానిసైతే దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తరుచూ ఈ ఉత్ప్రేరకాలు తీసుకుంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు లైంగిక సామర్థ్యం తగ్గి పోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
దందా ఎలా బయటపడిందంటే..
చాంద్రాయణగుట్ట అల్జూబిలీ కాలనీ చెందిన మహ్మద్ షా పహర్ గతంలో మెడికల్ రిప్రెంజెంటివ్గా పని చేశారు. అతడికి పలు మెడికల్ ఏజెన్సీలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో షా పహర్చాదర్ ఘాట్ కు చెంది షేక్ అబ్దుల్ ఒవైసీ తో చేతులు కలిపి హైదరాబాద్ లో ఈ దందాకు తెరలేపాడు. వీళ్లు ఢిల్లీకి చెందిన అక్షయ్ ఎంటర్ ప్రైజెస్ మెడికల్ ఏజెన్సీకి చెందిన విక్రమ్ అనే వ్యక్తితో చేతులు కలిపి ఈ ఇంజక్షన్లను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ యువతకు అంటగడుతున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు.