డ్ర‌గ్స్ ర‌చ్చ స‌రే.. మ‌రి వాళ్ల సంగ‌తేంది?

Update: 2017-07-16 08:37 GMT
ఇష్యూల‌న్నీ ప‌క్క‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకటే చ‌ర్చ‌.. ఒకటే ర‌చ్చ‌. అదే.. డ్ర‌గ్స్‌. ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ‌. మ‌రికాసేప‌ట్లో మ‌రేదైనా కొత్త మాట బ్రేక్ అవుతుందా? అన్నట్లుగా టీవీ ఛాన‌ళ్ల‌లో వార్త‌లు ప్ర‌సార‌మ‌వుతున్నాయి. టీవీ ఛాన‌ళ్ల‌లో ఇంత హాట్ టాపిక్ గా మారిన డ్ర‌గ్స్ ముచ్చ‌ట‌.. ప్ర‌జ‌ల్ని ఆ ఇష్యూ మీద దృష్టి పెట్టేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కు సంబంధించిన బ‌య‌ట‌కు వ‌చ్చిన పేర్ల మీద చ‌ర్చ‌తో పాటు.. బ‌య‌ట‌కురాని వారి పేర్ల మీద జ‌రుగుతున్న చ‌ర్చ కూడా భారీగానే సాగుతోంది. ఇంత హ‌డావుడి మధ్య ఒక విష‌యాన్ని అంద‌రూ మ‌ర్చిపోయ‌న‌ట్లుగా క‌నిపిస్తోంది. అదేమంటే.. డ్ర‌గ్స్‌కు బాగా అల‌వాటు ప‌డిపోయిన సినీ ప్ర‌ముఖులు.. ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌.

ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన దిన‌ప‌త్రిక‌లో ఇటీవ‌ల అచ్చు అయిన డ్ర‌గ్స్ వార్త‌లో ఒక షాకింగ్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. డ్ర‌గ్స్ వినియోగంలో ఒక మాజీ హీరోయిన్ పూర్తిగా మునిగిపోయింద‌ని.. డ్ర‌గ్స్ లేనిదే ఉండ‌లేని ప‌రిస్థితికి చేరిపోయింద‌ని.. కావాలంటే ఆమెను ఇప్ప‌టికిప్పుడు ఇక్క‌డ‌కు ర‌ప్పిస్తానంటూ నిందితుడు కెల్విన్ విచార‌ణ అధికారుల‌కు చెప్పిన‌ట్లుగా రాశారు.

ఈ మాజీ హీరోయిన్ మాదిరే.. మ‌రికొంద‌రు కూడా డ్ర‌గ్స్ గ‌మ్మ‌త్తులో పూర్తిగా మునిగిపోయిన‌ట్లుగా రాశారు. తాజాగా డ్ర‌గ్స్ ర‌చ్చ నేప‌థ్యంలో అలా పూర్తిగా బానిస అయిపోయిన వారి సంగ‌తేంది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. తాజా ర‌చ్చ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ ఇప్పుడు దొరికే అవ‌కాశం లేద‌ని చెప్పాలి. ఇక‌.. ర‌హ‌స్యంగా దాచుకున్న డ్ర‌గ్స్‌ను.. కేసుల భ‌యంతో పారేయ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. డ్ర‌గ్స్ లేనిదే బ‌త‌క‌లేని వారి సంగ‌తి ఏంది? వారిప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నార‌న్న  అంశంపైనా డ్ర‌గ్స్ కేసును విచారిస్తున్న అధికారులు దృష్టి సారించాల‌ని చెబుతున్నారు. డ్ర‌గ్స్ కేసు అంటూ అంద‌రూ హ‌డావుడి చేస్తున్న వేళ‌.. ఆ న‌ర‌క‌కూపంలో కూరుకుపోయిన వారిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు వీలైన వాతావ‌ర‌ణాన్ని ఎవ‌రు త‌యారుచేస్తార‌న్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. చెడిపోయారు..నాశ‌న‌మై పోయార‌న్న మాట‌ల స్థానే.. ఆ కూపంలో నుంచి బ‌య‌ట ప‌డేందుకు అవ‌స‌ర‌మైన స్థైర్యాన్ని అందించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి.. ఆ బాధ్య‌త‌ను ఎవ‌రు తీసుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు ఇప్పుడు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి.
Tags:    

Similar News