భారత్ పై నోరు పారేసుకున్న ట్రంప్

Update: 2020-10-23 07:50 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. ఒకవైపు అమెరికాలోని భారతీయుల ఓట్లను కోరుకుంటునే మరోవైపు భారత్ లోని వాతావరణపై నోరుపారేసుకోవటం ట్రంప్ కే చెల్లింది. డెమక్రటిక్ అభ్యర్ధి, ట్రంప్ ప్రత్యర్ధి జో బైడెన్ తో టెన్నెసీ రాష్ట్రంలోని నాష్ విల్లేలో  ముఖాముఖి కార్యక్రమం జిరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై అభ్యర్ధుల మధ్య వాదనలు జరిగాయి. ప్రపంచంలోని వాతావరణంలో మార్పులు కూడా అనేక అంశాల్లో ఒకటి. ఈ విషయమై ట్రంప్ మాట్లాడుతూ భారత్ లో వాతావరణం చాలా అసహ్యంగా, మురికిగా ఉంటుందంటూ పరుషంగా వ్యాఖ్యానించారు.

భారత్ లోనే కాకుండా రష్యా, చైనాలో వాతావరణం కూడా చాలా మురికిగా ఉంటుందంటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ ఓట్లకోసం ఒకవైపు పాకులాడుతు మరోవైపు భారత్ లోని వాతావరణంపై ఎలా తప్పుగా మాట్లాడుతారంటూ ట్రంప్ ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  ఇదే సమయంలో అమెరికాలో స్వచ్చమైన  వాతావరణం కోసం తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ట్రంప్ వివరించారు. స్వచ్చమైన వాతావరణం కోసం అమెరికాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కూడా చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయ సంతతి ఓట్లలో మెజారిటి జో బైడెన్ వైపు మళ్ళుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో ప్రచారంలో జో బైడెన్ తో పాటు ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న భారత మూలాలున్న కమలా హ్యారిస్ దూసుకుపోతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్-బైడెన్ మధ్య జరిగిన ముఖాముఖిలో కోవిడ్-19, కరోనా వల్ల మరణాలు, కరోనా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన కనుక్కోవటం, ఆరోగ్య పరిరక్షణ,  అమెరికాలో పెరిగిపోతున్న వర్ణ వివక్ష, పన్నులు తదితర అంశాలపై చర్చ జరిగింది.

ముఖాముఖిలో కొన్ని సందర్భాల్లో బైడెన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ట్రంప్ దూషించటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఇద్దరి మధ్యా జరిగిన ముఖాముఖి కార్యక్రమం ఎలాగున్నా దాన్ని నిర్వహించిన ఎన్బీసీ న్యూస్ వ్యాఖ్యత కిరిస్టన్ వెల్కర్ కే ఎక్కువ మార్కులు వేశారు నెటిజన్లు. ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో జరిగిన చర్చను కిరిస్టన్ చక్కగా నిర్వహించాడంటూ అభినందనలు వెల్లువెత్తాయి.
Tags:    

Similar News