నమస్తే ట్రంప్:మోడీ ముందే పాక్ కి మద్దతు ప్రకటించిన ట్రంప్ !

Update: 2020-02-24 12:11 GMT
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతెరా వేదికగా సాగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో అమెరికా ప్రెసిడెంట్  డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. దేశం కోసం మోదీ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, భారత్‌  - అమెరికాలు 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రకటించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని అంటూ అమెరికా భారత్‌ ను అభిమానిస్తుందని అన్నారు. 

భారత్‌ - అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ స్నేహితులు..లక్ష మందికి పైగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. భారత్‌ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరిచిపోలేం..ఈ పర్యటన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిఉంటుంది. అత్యంత విజయవంతమైన ప్రధానుల్లో మోదీ ఒకరు అని, భారతీయులు ఏదైనా సాదించగలరనేందుకు మోదీనే ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపారు.

ఇక ఇదే సమయంలో పాక్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇండో-ఫసిఫిక్ రీజియన్ లో శాంతి కోసం ప్రయత్నిద్దాం. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కలిసికట్టుగా అణిచేద్దాం. టెర్రరిజానికి అడ్డుకట్టవేసేలా పాకిస్తాన్ తోనూ మేం చర్చలు జరుపుతున్నాం. పాక్ ఒక  మంచి మిత్రదేశం కూడా. భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నాం. కలిసికట్లుగా మనం రెండు దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం అని, త్వరలోనే అది సాధ్యమవుతుంది అని తెలిపారు. అలాగే ఉగ్రవాదాన్ని అమెరికా ఏ మాత్రం సహించదని,  సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రతీ దేశం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags:    

Similar News