• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డొనాల్ట్ ట్రంప్ సంచలన...

డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..నవంబర్‌ లో కరోనా వ్యాక్సిన్!

By - Tupaki Desk
Update: 2020-08-07 14:45 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని, అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే , ఈ ఏడాది నవంబర్ 3నే .. ప్రెసిడెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  కరోనా  విలయతాండవం చేస్తున్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసేందుకు వీలులేకపోవడంతో అనుకున్నట్టుగానే ఎన్నికలు నవంబర్ లో జరగబోతున్నాయి.  

ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువకాగా, ఇప్పటివరకూ 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కానీ , సీడీసీ అధికారులు కరోనా వాక్సిన్ రిలీజ్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, 2021ప్రారంభంలో వాక్సిన్ వస్తుందని చెప్పారు.  అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కరోనా వాక్సిన్ నవంబర్ మొదటివారంలోనే అమెరికాలో అందుబాటులోకి వస్తుందని చెప్పడంతో ఇప్పుడు  సంచలనంగా మారింది. 
Tags:    
  • Dangerous Disease In America 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu News Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS